గ్లోబల్ ఫ్యాషన్ రంగానికి మార్గదర్శకత్వం వహిస్తూ, 2024 వేసవికి దాని ప్రసిద్ధ మాక్స్ కిడ్స్ ఫెస్టివల్ ప్రచారాన్ని సగర్వంగా మ్యాక్స్ ఫ్యాషన్ ఆవిష్కరించింది. 14 సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పటి నుండి, దేశ వ్యాప్తంగా కుటుంబాలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంగా మ్యాక్స్ కిడ్స్ ఫెస్టివల్ ఎదిగింది. దేశంలోని ప్రతిఒక్కరికీ అత్యంత ఇష్టమైన ఫ్యాషన్ బ్రాండ్‌గా మ్యాక్స్ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. నేడు, మ్యాక్స్ మొత్తం అమ్మకాలలో నాలుగో వంతు వాటాను పిల్లల విభాగం కలిగి ఉంది. దేశవ్యాప్త వార్షిక కార్యక్రమం పిల్లలు, యుక్తవయస్కులు తమ సృజనాత్మకతను కళా మాధ్యమం ద్వారా వేడుక చేసుకోవడంపై దృష్టి పెడుతుంది. ఈ సంవత్సరం ఎడిషన్ 21 నగరాలు, 100 కంటే ఎక్కువ మ్యాక్స్ స్టోర్‌లలో పిల్లలు, యుక్తవయస్కుల కోసం అపూర్వమైన రీతిలో భారతదేశ వ్యాప్త డ్రాయింగ్, కలరింగ్ పోటీని కలిగి ఉంటుంది.
మ్యాక్స్ ఫ్యాషన్ ఇండియా హెడ్ మార్కెటింగ్, పల్లవి పాండే మాట్లాడుతూ, "మ్యాక్స్ కిడ్స్ ఫెస్టివల్ మా అతిపెద్ద, ఎక్కువమంది ఇష్టపడే వార్షిక బ్రాండ్ ఐపి. మా చిన్న అభిమానులకు అసమానమైన అనుభవాన్ని అందించడానికి మేము కృషి చేస్తున్నందున, ప్రతి సంవత్సరం, ఇది గొప్పగా పెరుగుతుంది. పిల్లలలో అంతర్లీనంగా ఉన్న అపరిమితమైన అభిరుచి, సృజనాత్మకత, కృషిని మేము గుర్తించాము. అందుకే ఈ సంవత్సరం, మేము వారి అద్భుతమైన ప్రతిభను నిజంగా అద్భుతమైన రీతిలో ప్రదర్శిస్తున్నాము, పిల్లల ఊహలకు జీవం పొసే వేడుక ఈ ఫెస్టివల్. వారి గొంతును మరింతగా పెంచటంతో పాటుగా, సృజనాత్మక వ్యక్తీకరణలను మునుపెన్నడూ లేని విధంగా వ్యక్తీకరించే ఒక వేదికను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని అన్నారు.
డ్రాయింగ్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించేందుకు, ప్రముఖ నటి, మాజీ మిస్ ఇండియా, నేహా ధూపియా ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఈవెంట్ సందర్భంగా ఆమె మీడియా, ఇతర గౌరవనీయ అతిథులతో కూడా సంభాషించనున్నారు. ప్రతి సంవత్సరం, మ్యాక్స్ జనాదరణ పొందిన కామిక్ థీమ్‌ల చుట్టూ తమ కలెక్షన్‌ను ఆలోచనాత్మకంగా తీర్చిదిద్దుతుంది. ఈ సంవత్సరం, వారు ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్‌ల నుండి ప్రియమైన షోలు, క్యారెక్టర్స్‌ను చేర్చడానికి కామిక్స్‌కు మించి తమ స్ఫూర్తిని విస్తరించారు. 2024 కలెక్షన్ గార్ఫీల్డ్, స్పాంజ్‌బాబ్, ఎల్ఓఎల్ సర్‌ప్రైజ్ వంటి ఐకానిక్ కామిక్ క్యారెక్టర్‌ల సమ్మేళనంలా ఉండటంతో పాటుగా వెడ్నస్ డే, స్ట్రేంజర్ థింగ్స్, వన్ పీస్ వంటి అభిమానుల-ఇష్ట ఓటిటి సంచలనాలతో సజావుగా మిళితం చేయబడినది. ఈ కలెక్షన్‌లో అధిక శాతం రూ.129 నుండి లభిస్తాయి. ఈ కార్యక్రమంలో పిల్లలు సృష్టించిన షాపింగ్ బ్యాగ్‌లను ప్రదర్శించే ప్రదర్శన కూడ ఉంటుంది. దానితో పాటు పిల్లలు, యుక్తవయస్కుల కోసం రూపొందించిన ఆకర్షణీయమైన కళా కార్యక్రమాలు కూడా ఉంటాయి. అదనంగా, అర్బన్ కలెక్షన్‌ను దృష్టిలో ఉంచుకుని యూత్ ఫ్యాషన్ షో ఆకర్షణీయంగా ప్రదర్శితం కానుంది.
ఈ సందర్భంగా మ్యాక్స్ ఫ్యాషన్ ఇండియా ప్రెసిడెంట్-డిప్యూటీ సీఈఓ సుమిత్ చంద్నా మాట్లాడుతూ, "టీనేజర్లు మరియు పిల్లల కోసం చక్కని, అధునాతనమైన కలెక్షన్‌లను తీసుకురావాలనే మా నిబద్ధతకు కట్టుబడి సంవత్సరాలుగా మేము ప్రయత్నిస్తూ కాలపరీక్షకు సైతం తట్టుకుని నిలబడి ఉన్నాము. ఈ తిరుగులేని దృష్టి, మా బ్రాండ్ గుర్తింపును బలోపేతం చేయడమే కాకుండా, జెన్ జెడ్ మరియు యూత్ సెగ్మెంట్‌ల నుండి తోడ్పాటును సంవత్సరం తరువాత సంవత్సరం మెరుగుపరచటంలో సహాయ పడింది. నిరంతరం మారుతున్న యువత అభిరుచులు, ప్రాధాన్యతలతో ప్రతిధ్వనించే బ్రాండ్‌గా ఫాస్ట్ ఫ్యాషన్ కోసం గమ్యంగా నిలువటాన్ని మేము సంతోషిస్తున్నాము" అని అన్నారు.
మూడు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు 2024 మ్యాక్స్ కిడ్స్ ఫెస్టివల్ తెరువబడి ఉంటుంది. భారతదేశ వ్యాప్తంగా మ్యాక్స్ స్టోర్స్‌లలో ఇది జరుగుతుంది. స్టోర్‌లో అందించిన రీసైకిల్ చేయగల కాగితంతో తయారుచేయబడిన షాపింగ్ బ్యాగ్‌పై “భూమిని కాపాడే మీ సూపర్‌హీరోను గీయండి” నేపథ్యంతో తమ చిత్రాలను గీయాల్సి ఉంటుంది. బహుళ నగరాల నుండి 23000+ మంది పిల్లలు నమోదు చేసుకున్నారు. అందుకున్న ఎంట్రీలు జూన్ 16న బెంగళూరులోని మాల్ ఆఫ్ ఆసియాలో జరిగే ప్రత్యేక మ్యాక్స్ కిడ్స్ ఫెస్టివల్ ఈవెంట్‌లో ప్రదర్శించబడతాయి. ఎంపిక చేసిన ఏడుగురు గ్రాండ్ ప్రైజ్ విజేతలు తమ కుటుంబాలతో కలిసి కాశ్మీర్‌కు అన్ని ఖర్చులతో కూడిన పర్యటనను గెలుచుకుంటారు.