శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 మే 2022 (19:33 IST)

మెర్సిడెస్ బెంజ్ నుంచి సి-క్లాస్ న్యూ లగ్జరీ కారు ఆవిష్కరణ

mercedes benz car
దేశంలో లగ్జరీకార్ల తయారీలో ఒకటిగా ఉన్న మెర్సిడెస్ బెంజ్ కారు తాజాగా సి-క్లాస్ పేరుతో కొత్త లగ్జరీ కారును తమిళనాడు రాష్ట్ర మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కారు ఆవిష్కరణకు ముందే 2022 సంవత్సరం తొలి త్రైమాసికంలో 1000కు పైగా కార్లను కస్టమర్లు బుక్ చేసుకున్నారు. వీరికి కార్లు డెలివరీ చేయడానికి కనీసం రెండు మూడు నెలల సమయం పడుతుంది.
 
ఈ కారు ఆవిష్కరణ సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ అయ్యర్ మాట్లాడుతూ, మెర్సిడెస్-బెంజ్ అమ్మకాల్లో దేశంలోనే తమిళనాడు ముఖ్యమైన మార్కెట్‌గా మిగిలిపోయింది. తొలి త్రైమాసికంలో 2022లో 35 శాతం వృద్ధి సాధించినట్టు తెలిపారు. 2022లో తమిళనాడు మార్కెట్‌కి బలమైన రెండంకెల వృద్ధిని సాధిస్తామని అంచనా వేసినట్టు తెలిపారు. 
 
ఈ న్యూ సి-క్లాస్ లగ్జరీ కార్లలో పొడవైన వీల్‌బేస్‌, మరింత లెగ్‌రూమ్, హెడ్‌రూమ్, వెనుక భాగంలో ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. టెక్నాలజీ పవర్‌హౌస్ వంటి అత్యాధునిక సౌకర్యాల ఉంన్నాయి. విస్తృతమైన వ్యక్తిగతీకరణ, బయోమెట్రిక్ ప్రమాణీకరణ, విప్లవాత్మక కార్ నుండి ఎక్స్ కమ్యూనికేషన్, కొత్త సి-క్లాస్ ఐఎస్జీ టెక్నాలజీని ఉపయోగించి అత్యుత్తమ పవర్ డెలివరీ సదుపాయం ఉంది.
 
గణనీయమైన ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం సీ200, సీ220డి, సి300డి రకం మోడళ్లను అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించారు. ఇందులో సీ200 కారు ధర రూ.55 లక్షలు, సి220డి ధర రూ.56 లక్షలు, సి300డి ధర రూ.61 లక్షలుగా ఉందని తెలిపారు.
 
'తమిళనాడులో కొత్త సి-క్లాస్‌ను ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మెర్సీడెస్ బెంజ్ ఇండియా మార్కెట్‌లో తమిళనాడు మార్కెట్ ఎంతో కీలకమైనది. నిలకడగా అమ్మకాలు సాగిస్తోంది. ఈ యేడాది ఆరంభంలోనే విక్రయాలు ఊపందుకోవడంతో 2022లో బలమైన రెండంకెల వృద్ధిని సాధించగలమన్న విశ్వాసం మాకు ఉంది. అల్ట్రా-విలాసవంతమైన వాహనాల కోసం యువత అధిక ఆసక్తి చూపుతోంది. 2022 సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ వృద్ధిరేటు 90 శాతంగా ఉందిని ఆయన తెలిపారు. 
 
ఈ ప్రారంభంతో, ఎనిమిది ఉత్పత్తులతో కూడిన మా సెడాన్ పోర్ట్‌ఫోలియో మరింత బలపడుతుంది. లగ్జరీ సెడాన్‌లకు బలమైన ప్రాధాన్యతని తెలియజేస్తోంది. బలవంతులను చూడటం ప్రోత్సాహకరంగా ఉంటుంది. లగ్జరీ సెడాన్‌ల ఆవిర్భావం వారి ప్రత్యేక గుర్తింపును కలిగి ఉందని పేర్కొన్నారు.