బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 23 జూన్ 2020 (20:04 IST)

సుజయ్ దాస్‌ను చీఫ్ రిస్క్ ఆఫీసర్‌గా నియమించిన మనీట్యాప్

ఇటీవలి పరిణామాలలో, యాప్ ఆధారిత వినియోగదారు క్రెడిట్ లైన్ సంస్థ మనీట్యాప్, సుజయ్ దాస్‌ను చీఫ్ రిస్క్ ఆఫీసర్‌గా నియమించింది. ఋణ మరియు ఆర్థిక రంగంలో అనుభవజ్ఞుడైన సుజయ్ వివిధ భౌగోళిక ప్రాంతాలలో వివిధ ఆర్థిక సంస్థలలో పనిచేస్తున్న రిస్క్ మేనేజ్‌మెంట్, అనలిటిక్స్ మరియు క్రెడిట్ పాలసీలో 19 సంవత్సరాల అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఆయన ఆయా సంస్థలలో అనేక అధిక పనితీరు గల రిస్క్ మేనేజ్‌మెంట్ బృందాలను నిర్మించాడు.
 
డేటా సైన్స్ మరియు స్టాటిస్టికల్ మోడలింగ్ చేత బలపరచబడిన కోవిడ్ అనంతర ఆర్థిక వ్యవస్థలో మనీట్యాప్ వద్ద వినూత్న క్రెడిట్ విధానాలు మరియు వ్యూహాలను రూపొందించడంలో సుజయ్ యొక్క నైపుణ్యం కీలక పాత్ర పోషిస్తుంది. గతంలో, బజాజ్ ఫిన్ సర్వ్ లిమిటెడ్‌లో రిస్క్ అనలిటిక్స్ హెడ్‌గా పనిచేశారు.
 
ఇతర వృత్తిపరమైన మెప్పులలో, హెచ్.ఎస్.బి.సిలో వివిధ నాయకత్వ స్థానాల్లో 13 సంవత్సరాలు అపార అనుభవం ఉంది. సుజయ్ హెచ్‌.ఎస్‌.బి.సిలో పదవీ విరమణ సమయానికి, వీపీ, రిస్క్ అనలిటిక్స్‌గా ఉన్నాడు. హెచ్‌.ఎస్‌.బి.సికి ముందు, రిస్క్ మేనేజ్‌మెంట్ మరియు అనలిటిక్స్ విభాగంలో జి.ఇ క్యాపిటల్‌లో పనిచేశారు. సుజయ్ 2001 లో జె.ఎన్‌.యు (జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం) నుండి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.
 
"మా అభివృద్ధి కథనం యొక్క కేంద్ర బిందువుగా, సుజయ్ చేరినందుకు మేము సంతోషిస్తున్నాము. రిస్క్ మేనేజ్మెంట్ మరియు అనలిటిక్స్ గురించి లోతైన పరిజ్ఞానాన్ని సంస్థకు అందిస్తారు. రిస్క్ పాలసీల కోసం సరియిన తనిఖీలు మరియు బ్యాలెన్సుల నిర్వహణలో ఆయన మార్గదర్శకం కోసం మేము ఎదురుచూస్తున్నాము. మా బలమైన క్రెడిట్ క్రమశిక్షణను బలోపేతం చేయడంలో అతని ఇన్పుట్లు ఎంతో కీలక పాత్ర వహిస్తాయని మేము ఆశిస్తున్నాము" అని మనీట్యాప్ యొక్క చీఫ్ బిజినెస్ ఆఫీసర్ & కో-ఫౌండర్ కునాల్ వర్మ అన్నారు.
 
"మనీటాప్‌లో నా పాత్రలో, నా దృష్టంతా కూడా, సంస్థ కొరకు రిస్క్ మరియు రాబడిని సమతుల్యం చేయడంపైనే ఉంటుంది. వ్యాపార లక్ష్యంగా అత్యుత్తమ అభివృద్ధి పథం ఉన్నప్పటికీ, అత్యుత్తమ తరగతి క్రెడిట్ పద్ధతులను సంస్థాగతీకరించడం మరియు నిరర్థక ఆస్తులపై తనిఖీ ఉంచడం నా బాధ్యత," అని సుజయ్ దాస్ తన నియామకంపై చెప్పారు.