మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2016 (17:33 IST)

త్వరలో రూ.2000 నోటు రద్దు : ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త వెల్లడి

భారత రిజర్వు బ్యాంకు ఇటీవల చలామణిలోకి తీసుకొచ్చిన రూ.2 వేల నోటును కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రద్దు చేస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతకర్త, ఆర్థిక నిపుణుడు ఎస్.గురుమూర్తి అభిప్రాయపడ్డారు. రా

భారత రిజర్వు బ్యాంకు ఇటీవల చలామణిలోకి తీసుకొచ్చిన రూ.2 వేల నోటును కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రద్దు చేస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతకర్త, ఆర్థిక నిపుణుడు ఎస్.గురుమూర్తి అభిప్రాయపడ్డారు. రానున్న ఐదేళ్లలో ఇది ఎప్పుడైనా జరగవచ్చన్నారు. రద్దు చేసేందుకు రెండు వేల రూపాయల నోటు తీసుకొచ్చారని తెలిపారు. దేశంలో ఐదొందల నోటే అతి పెద్ద నోటుగా చెలామణిలో ఉంటుందన్నారు.
 
వచ్చే ఏడాది జూన్‌నాటికే ఈ రెండు వేల రూపాయల నోటును చెలామణి నుంచి తొలగిస్తారని ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పలు మీడియా సంస్థలు దీనికి సంబంధించి వార్తా కథనాలు కూడా ప్రచురించాయి. మరోవైపు ఇప్పటికే వెయ్యి రూపాయల నోటు కొత్త రూపంలో రానున్నట్లు సోషల్ మీడియాలో నమూనా నోట్లు దర్శనమిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గురుమూర్తి వ్యాఖ్యలు కీలకంగా మారాయి.