మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (12:08 IST)

పేటీఎం నుంచి కొత్త పరికరం.. ఏంటి ప్రయోజనం..?

ఆన్‌లైన్ బ్యాకింగ్ దిగ్గజం పేటీఎం కొత్తగా ఓ పరికరాన్ని ప్రవేశపెట్టింది. చిన్న వ్యాపార లావాదేవీలకు అనుగుణంగా ఉండే విధంగా ఆండ్రాయిడ్ పీఓఎస్ ప‌రిక‌రాన్ని ఈ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప‌రిక‌రం పేటీఎం వాలెట్‌, యూపీఐ ఆధారిత యాప్స్‌, డెబిట్, క్రెడిట్ కార్డ్ , న‌గ‌దుతో స‌హా అన్ని లావాదేవీల‌ను అనుమతిస్తుంది. ఇంకా జీఎస్టీ బిల్లులను కూడా జనరేట్ చేస్తుంది. 
 
ఈ పరికరం బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌తో, టికెటింగ్, క్యాటరింగ్ నుంచి పార్కింగ్ వరకు వివిధ పరిశ్రమ రంగాలకు అనుగుణంగా అందుబాటులోకి వచ్చింది. ఈ పరికరంలో ఉండే ప్రింటర్, స్కానర్ బిల్లులను జనరేట్ చేస్తుంది. 
 
ఇన్ఫోసిస్ స‌హ వ్య‌వ‌స్థాప‌కులు నంద‌న్ నీలేఖ‌నితో క‌లిసి ఈ ప‌రిక‌రాన్ని ఆయన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను అంగీకరించాలని పేటీఎం ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టడం హర్షించే విషయమని తెలిపారు.