పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెంపు
పెట్రోల్ ధరలు పెరుగుతూనే వున్నాయి. రోజు రోజుకీ పైసలు లెక్కన పెట్రో మోత సామాన్యుడిపై తప్పడం లేదు. ఓ వైపు కరోనాతో అల్లాడుతుంటే.. పెరిగిన ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది.
అంతర్జాతీయంగా చమురు ధరలను బట్టి.. దేశీయంగా పెంపు ఉంటోందంటున్నాయి కంపెనీలు. నిత్యావసర సరుకుల ధరలు కూడా పెంచేస్తున్నారు. మే నెల నుంచి ఈ ధరల బాదుడు షురూ అయ్యింది. తాజాగా.. పెట్రోల్ పై 27 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెరిగింది.
హైదరాబాద్ లో పెట్రోల్ లీటర్ ధర రూ. 0.28 పెరిగి…రూ. 98.48కి చేరుకోగా..డీజిల్ ధర లీటర్ రూ. 0.30 పెరిగి..రూ. 93.38గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.0.00 పెరిగి రూ. 99.99కి చేరగా, డీజిల్ ధర లీటర్ రూ.0.01 పెరిగి రూ.95.02కి చేరుకుంది.