బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (08:40 IST)

92 పైసలతో రూ.10 లక్షల బీమా... ఎక్కడ?

ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా గుర్తింపు పొందిన సంస్థ భారతీయ రైల్వే. ఈ సంస్థలో ప్రమాదాలు కూడా అదే స్థాయిలోనే జరుగుతున్నాయి. సురక్షితమైన రైలు ప్రయాణం కోసం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. క

ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా గుర్తింపు పొందిన సంస్థ భారతీయ రైల్వే. ఈ సంస్థలో ప్రమాదాలు కూడా అదే స్థాయిలోనే జరుగుతున్నాయి. సురక్షితమైన రైలు ప్రయాణం కోసం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కొన్ని రకాల మానవ తప్పిదాలు, సాంకేతిక సమస్యల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైలు ప్రయాణికుల కోసం బీమా సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. 
 
రైలు ప్రయాణ సమయంలో అనుకోని సంఘటనలు ఎదురైతే ప్రయాణికులను ఆదుకునేందుకు ఈ బీమా పథకాన్ని రైల్వే శాఖ ప్ర‌వేశ‌పెట్టింది. రైలు ప్రయాణం కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో, రైల్వే టికెట్ కౌంట‌ర్ల‌లో టికెట్‌ బుక్‌ చేసుకునే ప్రయాణికులకు రూ.10 లక్షల బీమా సదుపాయాన్ని ఈ పథకం కింద కల్పిస్తారు. టికెట్‌ను బుక్‌ చేసుకునే సమయంలో కేవలం 92 పైసలుకే ఈ సదుపాయాన్ని పొందవచ్చు. 
 
ఈ బీమా సదుపాయం అర్బన్‌, సబర్బన్‌ రైళ్లు మినహా ఇతర రైళ్లన్నింటికీ వరిస్తుంది. రైలు ప్రయాణంలో ప్రమాదం జరిగితే.. చనిపోయినా లేదా శాశ్వత అంగవైకల్యం సంభవించినా బాధితులకు రూ.10 లక్షలు, పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే రూ.7.50 లక్షలు, ఆస్పత్రిపాలైతే రూ.2 లక్షలు చెల్లిస్తారు. మృతదేహాల తరలింపునకు రూ.10 వేలు చెల్లిస్తారు. 
 
అయితే ఐదేళ్ల వయసు లోపు పిల్లలకు, విదేశీయులకు ఈ బీమా వర్తించదు. రైలు టికెట్ బుక్ చేసుకున్న వెంట‌నే మీరు ఇచ్చిన ఫోన్ నెంబ‌ర్‌, ఈ మెయిల్ ఐడీకి ఈ బీమా బాండ్ వ‌స్తుంది. ఈ బాండ్ మీరు బుక్ చేసుకున్న టికెట్ ప్ర‌యాణం ముగిసే వ‌ర‌కు వ‌ర్తిస్తుంది.