ఎస్బీఐ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ : నెట్‌బ్యాంకింగ్, ఈ-కామర్స్ సైట్ల ద్వారా జమకు చెక్
తమ ఖాతాదారులకు భారతీయ స్టేట్ బ్యాంకు ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. అయితే పేటీఎం, ఫ్రీచార్జ్, మొబిక్విక్, జియో మనీ, ఎయిర్‌టెల్ మనీ వంటి వ్యాలెట్ సర్వీసుల్లోకి.. మీ ఖాతా నుంచి ఇంటర్‌నెట్ బ్యాంకింగ్
తమ ఖాతాదారులకు భారతీయ స్టేట్ బ్యాంకు ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. అయితే పేటీఎం, ఫ్రీచార్జ్, మొబిక్విక్, జియో మనీ, ఎయిర్‌టెల్ మనీ వంటి వ్యాలెట్ సర్వీసుల్లోకి.. మీ ఖాతా నుంచి ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా, ఈ కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా డబ్బు వేయలేరు. ఈ రెండు విధానాల ద్వారా అలాంటి సర్వీసుల్లోకి ఖాతాదారులు డబ్బు బదిలీ చేసే అవకాశం లేకుండా ఎస్‌బీఐ బ్లాక్ చేస్తోంది.
ఆసక్తికరమైన విషయమేంటంటే.. పేటీఎంలాగానే పనిచేసే స్టేట్‌బ్యాంక్ ఈవ్యాలెట్ ‘ఎస్‌బీఐ బడ్డీ’ నుంచి కూడా ఈ-వ్యాలెట్లకు డబ్బు బదిలీ చేసే అవకాశం ఉంది. అలాగే ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా ఈ వ్యాలెట్లలోకి డబ్బు జమ చేయగలరు. భద్రతా కారణాల రీత్యానే మిగతా రెండు విధానాలను బ్లాక్ చేస్తున్నట్టు ఎస్‌బీఐ వర్గాలు తెలుపుతున్నాయి.
నోట్ల రద్దు నేపథ్యంలో ఈ-వ్యాలెట్ సర్వీసులే నగదుకు ప్రధాన ప్రత్యామ్నాయంగా మారాయని, అలాంటి సర్వీసుల్లో డబ్బు జమను అడ్డుకోవడానికి కారణాలేంటో వివరించాలని ఎస్‌బీఐని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. కాగా ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, ఈకామర్స్ వెబ్‌సైట్ల నుంచి కూడా డబ్బు జమ చేసే అవకాశం కల్పించడంపై పునఃపరిశీలించాలని ఎస్‌బీఐని మొబిక్విక్ కోరింది.