సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (13:33 IST)

స్కూట్ ఎయిర్‌లైన్స్ ఆఫర్... రూ.12 వేలకే యూరప్ ప్రయాణం

సింగపూర్‌కు చెందిన ఎయిర్‌లైన్స్ సంస్థల్లో ఒకటైన స్కూట్ ఎయిర్‌‌లైన్స్ సంస్థ ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.12 వేలకే యూరప్ ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపింది. ఇంత తక్కువ ధరలో యూరప్‌కు ప్ర

సింగపూర్‌కు చెందిన ఎయిర్‌లైన్స్ సంస్థల్లో ఒకటైన స్కూట్ ఎయిర్‌‌లైన్స్ సంస్థ ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.12 వేలకే యూరప్ ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపింది. ఇంత తక్కువ ధరలో యూరప్‌కు ప్రయాణ సౌకర్యం కల్పించనుండటం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
 
వాస్తవానికి భారత్-యూరప్ మధ్య విమాన ప్రయాణ టిక్కెట్ ధర కనిష్టంగా రూ.45 వేలు ఉంది. అయితే, ఈ చార్జీ ధరను భారీగా తగ్గించనున్నారు. దీనిపై స్కూట్ ఎయిర్‌లైన్స్ అధిపతి భరత్ మహదేవన్ మాట్లాడుతూ, ప్రస్తుతం ముంబై నుంచి కొపెన్‌హాగెన్‌కు డైరెక్ట్ విమాన టిక్కెట్ ధర రూ.45 వేల స్థాయిలో ఉందని, దీన్ని త్వరలోనే రూ.12 వేల వరకు తగ్గనుందని చెప్పారు. 
 
అలాగే, ప్రతి ప్రయాణికుడు తమ వెంట 20 కిలోల లగేజీని ఉచితంగా తీసుకెళ్లగలగడంతోపాటు ప్రయాణంలో భోజనం కూడా అందించనున్నట్లు ఆయన తెలిపారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాల నుంచి కోపెన్‌హాగెన్, వియన్నా, కైరో, మాంచెస్టర్‌లకు డైరెక్ట్ విమాన సర్వీసులను నడుపనున్నట్లు తెలిపారు. దేశీయ సంస్థల్లో స్పైస్‌జెట్, ఇండిగో సైతం యూరప్‌కు చౌక విమానయాన సేవలు ఆఫర్ చేసే ప్రయత్నాల్లో ఉండటం గమనార్హం.