బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2017 (11:38 IST)

మరికొన్ని గంటల్లో జీఎస్టీ విధానం.. ధరలు తగ్గేవి.. ధరలు పెరిగేవి ఏవి?

ఒకే దేశ.. ఒకే పన్ను విధానం మరికొన్ని గంటల్లో అమల్లోకి రానుంది. భారత ఆర్థిక వ్యవస్థలో అతి పెద్ద సంస్కరణల్లో ఇది ఒకటి. దీంతో అన్ని వర్గాల వారిలో ఉత్కంఠ పెరిగిపోయింది. నిత్యావసర సరుకుల నుంచి మన్నిక గల వస

ఒకే దేశ.. ఒకే పన్ను విధానం మరికొన్ని గంటల్లో అమల్లోకి రానుంది. భారత ఆర్థిక వ్యవస్థలో అతి పెద్ద సంస్కరణల్లో ఇది ఒకటి. దీంతో అన్ని వర్గాల వారిలో ఉత్కంఠ పెరిగిపోయింది. నిత్యావసర సరుకుల నుంచి మన్నిక గల వస్తువుల వరకు ధరలపై ప్రభావం ఎలా ఉంటుందోనని ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. 
 
జీఎస్టీ దెబ్బకు వ్యాపారలావాదేవీలు తగ్గుముఖం పడతాయా? అని ఆరా తీస్తున్నారు. జీఎస్టీ ప్రభావం చెందే ప్రధాన రంగాల్లో మన్నికైన వస్తువులది (డ్యూరబుల్‌ గూడ్స్‌) ప్రధాన పాత్ర. వీటిపై పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ధరలు పెరిగినా, తగ్గినా ప్రభావం తీవ్రత పేద, ధనిక తేడా లేకుండా అన్ని వర్గాలపై పడుతుంది. కొనుగోళ్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. 
 
జీఎస్టీ పన్ను విధానం అమల్లోకి వస్తే బంగారం ధరలు స్వల్పంగా పెరగుతాయి. ఇప్పటివరకు బంగారం మీద 2 శాతం పన్ను మాత్రమే వసూలు చేస్తున్నారు. దీన్ని జూలై ఒకటో తేదీ నుంచి 3 శాతంగా వసూలు చేస్తారు. 
 
ఇక సిమెంట్‌ ధరల్లో కాస్త తగ్గుదల రానుంది. ఇప్పటివరకు సిమెంట్‌ మీద 31 శాతం వరకు పలు రకాల పన్నులు వసూలు చేస్తుండగా, జీఎస్టీలో 28 శ్లాబులో చేర్చారు. అంటే సుమారు 3శా తం వరకు ధరలు తగ్గనున్నాయి. ఈ మార్పు నిర్మాణరంగం అభివృద్ధికి దోహదం చేస్తుందని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. అలాగే, టీవీ, ఏసీ, ఫ్రిజ్‌, వాషింగ్‌ మిషన్‌, సిమెంట్‌ తదితరాల ధరలు తగ్గనున్నాయి. అదేవిధంగా స్మార్ట్‌ ఫోన్లు, బంగారం, ఆభరణాలు ధరలు పెరుగుతాయి.