ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 22 ఆగస్టు 2024 (18:03 IST)

ఏపీ-తెలంగాణ నుంచి విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల పరంగా కీలక పాత్ర పోషిస్తున్న టైర్ 2, టైర్ 3 నగరాలు

image
450కు పైగా యుఎస్ విశ్వవిద్యాలయాలు, 900కు పైగా ప్రముఖ ప్రపంచ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణాసియాలోని అతిపెద్ద విద్యార్థుల నియామక సంస్థ కెరీర్ మొజాయిక్ హైదరాబాద్‌లో 25 యుఎస్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించింది. కొత్త కోర్సులు, స్కాలర్‌షిప్‌లు, తదితర అంశాలను పంచుకోవడంపై ఈ విశ్వవిద్యాలయాలు దృష్టి సారించి, కళాశాల క్యాంపస్‌ల లోని విద్యార్థులు, కళాశాల సలహాదారులు, ఆంధ్రప్రదేశ్ (ఏపీ)- తెలంగాణా నుండి స్టడీ అబ్రాడ్ కన్సల్టెంట్‌లతో సమావేశమయ్యాయి. 
 
యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా పెంబ్రోక్, యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ లాంగ్ బీచ్, యూనివర్శిటీ ఆఫ్ నెవాడా-లాస్ వెగాస్, యూనివర్శిటీ ఆఫ్ మెంఫిస్, యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్-ఫ్లింట్, శాన్-జోస్ స్టేట్ యూనివర్శిటీ, సెంట్రల్ మిచిగాన్ యూనివర్శిటీ, మిడిల్ టెనెస్సీ స్టేట్, వర్జీనియా కామన్వెల్త్ విశ్వవిద్యాలయం, వెబ్‌స్టర్ విశ్వవిద్యాలయం, మరెన్నో విశ్వవిద్యాలయాల ప్రతినిధులు  రావటంతో పాటుగా విద్యార్థులు, స్టడీ అబ్రాడ్ కమ్యూనిటీతో చర్చిస్తున్నారు. ఈ ప్రతినిధులు విద్యార్థుల భద్రత, శ్రేయస్సుపై తమ అభిప్రాయాలను కూడా వెల్లడిస్తున్నారు. 
 
భారతదేశం యొక్క స్టడీ అబ్రాడ్ మార్కెట్‌కు గణనీయమైన సహకారులుగా ఏపీ, తెలంగాణలు ఉద్భవించాయి. దేశంలోని స్టడీ అబ్రాడ్ విద్యార్థులలో  సుమారు 12-14% ఈ రెండు రాష్ట్రాల నుండి వస్తున్నారు. కెరీర్ మొజాయిక్ 2023, 2024 ఫాల్ సీజన్ కోసం 1.6 లక్షల దరఖాస్తులను ప్రాసెస్ చేసింది, 60% కంటే ఎక్కువ ఏపీ, తెలంగాణ నుండి వచ్చాయి. రాబోయే ఫాల్ ఇన్‌టేక్‌లో ఈ ట్రెండ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతాల నుండి మా దరఖాస్తుదారులలో దాదాపు 30% మంది కాలిఫోర్నియా, మిచిగాన్, టెక్సాస్, మిస్సౌరీ, కనెక్టికట్, ఇల్లినాయిస్, న్యూజెర్సీ, న్యూయార్క్‌లోని విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేస్తున్నారు.
 
టాప్ అప్లికేషన్ కంట్రిబ్యూటర్లు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, గుంటూరు. అయితే తిరుపతి, నెల్లూరు వంటి టైర్-II, టైర్-III నగరాలు చెప్పుకోదగ్గ వృద్ధిని కనబరిచాయి. తిరుపతిలో 2023లో 137% దరఖాస్తులు పెరిగాయి, నెల్లూరులో 121% పెరుగుదల కనిపించింది. ఇది చిన్న పట్టణాలలో అంతర్జాతీయ విద్య నభ్యసించాలనే ఆసక్తిని ప్రతిబింబిస్తుంది, ఇక్కడ విద్యార్థులు ప్రపంచ అవకాశాలను ఎక్కువగా అన్వేషిస్తున్నారు.
 
కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ వంటి సాంప్రదాయ స్టెమ్ కోర్సులు ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, హెల్త్ సైన్స్, సైకాలజీ వంటి స్టెమ్ కోర్సులకు సైతం ఆసక్తి చూపుతుడటం గమనించదగ్గ అంశం, ఇవి వరుసగా 41%, 39% వృద్ధి రేటును చూశాయి. అదనంగా, యుఎస్ అగ్రశ్రేణి ఎంపికగా ఉన్నప్పటికీ, వాటి విభిన్న విద్యాపరమైన ఆఫర్‌లు, అభివృద్ధి చెందుతున్న అవకాశాల కారణంగా యూరోపియన్ గమ్యస్థానాలు ఏపీ- తెలంగాణ విద్యార్థులలో ప్రజాదరణ పొందుతున్నాయి.
 
కెరీర్ మొజాయిక్ వ్యవస్థాపకుడు- డైరెక్టర్ శ్రీ అభిజిత్ జవేరి మాట్లాడుతూ, “ఈ రోజు జరిగిన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్- తెలంగాణలోని విద్యార్థులకు విద్యావకాశాలను మెరుగ్గా తీసుకురావాలనే మా అచంచలమైన నిబద్ధతను వెల్లడిస్తుంది. ఈ రాష్ట్రాలు భారతదేశం యొక్క అంతర్జాతీయ విద్యారంగంలో కీలకమైన మార్కెట్‌లుగా ఉద్భవించాయి, ప్రత్యేకించి టైర్-II, టైర్-III నగరాల నుండి దరఖాస్తులు గణనీయంగా పెరిగాయి. గ్లోబల్ ఎడ్యుకేషన్ పట్ల విద్యార్థుల పెరుగుతున్న ఆకాంక్షలను ఇది ప్రతిబింబిస్తుంది. 450కి పైగా యుఎస్ విశ్వవిద్యాలయాలు, అగ్రశ్రేణి గ్లోబల్ సంస్థలతో మా విస్తృతమైన నెట్‌వర్క్ ఈ ప్రాంతాల విద్యార్థుల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి తగిన మార్గదర్శకత్వాన్ని అందించడానికి మాకు సహాయం చేస్తుంది" అని అన్నారు. 
 
ఆయనే మాట్లాడుతూ, "స్టెమ్ కోర్సులకు నిరంతర డిమాండ్‌తో పాటు హెల్త్ సైన్సెస్, సైకాలజీ వంటి రంగాలపై ఆసక్తి పెరగడంతో పాటు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల వైపు మళ్లడం కూడా మేము చూస్తున్నాము. యూరోపియన్ గమ్యస్థానాలకు పెరుగుతున్న ప్రాధాన్యత ఇక్కడి విద్యార్థుల అభివృద్ధి చెందుతున్న ఆశయాలను మరింత నొక్కి చెబుతుంది. మేము మా బృందం, నెట్‌వర్క్‌ని విస్తరింపజేసినప్పుడు, ఈ వృద్ధికి మద్దతు ఇవ్వడానికి, విద్యార్థులకు అత్యుత్తమ విద్యా- కెరీర్ అవకాశాలకు అవకాశాలు ఉండేలా చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని అన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ - తెలంగాణలలో తన ప్రత్యేక వనరులను మూడు రెట్లు పెంచడానికి, వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో తన నెట్‌వర్క్‌ను పెంచడానికి కెరీర్ మొజాయిక్ సిద్ధంగా ఉంది. విద్యార్థుల రుణాలు, ఇతర ఆర్థిక సహాయాలను సులభతరం చేయడానికి విశ్వవిద్యాలయాలతో కెరీర్ మొజాయిక్ భాగస్వామ్యం చేసుకుంటుంది. విద్యార్థులు విదేశాలలో తమ విద్యను కొనసాగించడానికి అవసరమైన వనరులను కలిగి ఉండేలా చూస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులపై సంస్థ దృష్టి పెరుగుతోంది. దాదాపు 13% మంది దరఖాస్తుదారులు, యుజి కోర్సులకు దరఖాస్తు చేస్తున్నారు. రాబోయే మూడేళ్లలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని భావిస్తున్నారు.