శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 22 ఆగస్టు 2024 (16:14 IST)

ముద్దాయిగా వున్న జోగి రమేష్ సమాచారం ఇవ్వడంలేదు: డిఎస్పి మురళి

jogi ramesh
ముద్దాయిగా వున్నటువంటి జోగి రమేష్ తాడేపల్లి పోలీసు స్టేషనులో క్రైం నెం 923 కేసులో ఆయనను పిలిపించడం జరిగిందని డిఎస్పీ మురళీకృష్ణ చెప్పారు. ఆయన మాట్లాడుతూ... మా కేసు దర్యాప్తుకి అవసరమైన సమాచారం ఇవ్వలేదు. అతడు ఇచ్చిన సమాచారం మాకు సంతృప్తినివ్వలేదు.
 
మాకున్న చట్టం ప్రకారం దర్యాప్తుకి అవసరమైన అతడి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రికల్ పరికరాలైనా స్వాధీనం చేసుకుని విచారించే అధికారం వుంది. ఐతే ఆయన లాయర్లు ఏవో జడ్జిమెంట్ కాపీలు తీసుకుని వచ్చారనీ, తమకు మాత్రం ఇంతవరకూ జోగి రమేష్ ఆయనకు సంబంధించిన ఫోను ఇవ్వలేదని అన్నారు. డేటాను అనుసరించి తమ దర్యాప్తు ప్రారంభమవుతుందనీ, అవసరమైతే మళ్లీ జోగి రమేష్‌ను పిలిపించి విచారిస్తామని అన్నారు.
 
మాజీ మంత్రి జోగి రమేష్ కేసు దర్యాప్తుకి సహకరించడం లేదని పోలీసులు చెపుతుండటంతో ఆయను అరెస్టు చేస్తారేమోనన్న చర్య మొదలైంది. ఇప్పటికే గతంలో కొందరు వైసిపి నాయకులు చేసిన చర్యల వల్ల ఇరుక్కుంటున్నారు.