గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 ఆగస్టు 2024 (15:56 IST)

సీఐడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న భూములు ఎలా కొంటారు ? మంత్రి పార్థసారథి

parthasarathy kolusu
అనేక మంది డిపాజిట్‌దార్లను మోసం చేసిన అగ్రిగోల్డ్‌కు భూములు సీఐడీ అటాచ్‌మెంట్‌లో ఉన్నట్టు తెలిసినప్పటికీ ఎలా కొనుగోలు చేస్తారని మంత్రి కొల్లు పార్థసారథి ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాజకీయ కక్షతో అరెస్టులు చేస్తున్నామని వైకాపా నేతలు అసత్యాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
'సీఐడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న భూములను చట్టవ్యతిరేకంగా కొని విక్రయించారు. అటాచ్‌మెంట్‌లో ఉన్న భూములను కొనడం ఎంతవరకు సబబు? తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో కొనుగోలు చేశారు. అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌లు చేసి పేదలు నష్టపోయారు' అని పార్థసారథి అన్నారు.
 
బహిర్భూమికి వెళ్లిన మాజీ సర్పంచ్‌పై కాలం చల్లి హత్య... ఎక్కడ? 
 
కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ వాకిడి శ్రీనివాసులుపై ప్రత్యర్థుల దాడా చేశారు. బహిర్భూమికి వెళ్లిన ఈ మాజీ సర్పంచ్‌పై కారం చల్లి హత్య చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ తన ట్విటర్ వేదికగా స్పందించారు. 
 
మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసీపీ మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల్లో టీడీపీ తరపున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్ళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథాను మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.
 
వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు.