ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 ఆగస్టు 2022 (10:51 IST)

స్థిరంగా బంగారం ధరలు... తగ్గిన వెండి ధర

gold
బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. పెళ్లిళ్ళ సీజన్‌తో పాటు... ఇతర అవసరాలకు బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. గత వారం రోజులుగా ఈ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ పరిస్థితి ఈ నెల 13వ తేదీ నుంచి కొనసాగుతోంది. 
 
ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ.47900గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.52250గా ఉంది. అయితే, దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రం బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. గడిచిన మూడు రోజులుగా వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. మూడు రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ.2400 మేరకు తగ్గింది. 
 
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.62400గా ఉండగా, విజయవాడ నగరంలో రూ.62400గాను, ఢిల్లీలో రూ.56700గాను, ముంబైలో రూ.56700గా ఉంది. 
 
బంగారం ధరలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47900గాను, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52250గా ఉంది. విజయవాడ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47900గాను, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52250గా ఉంది. 
 
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48050గాను, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52400గా ఉంది. ముంబై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900గాను, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52250గా ఉంది.