శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 30 మే 2024 (22:39 IST)

400 మిలియన్ల క్రియాశీల యూజర్లను అధిగమించిన ట్రూ కాలర్

True caller
కాంటాక్ట్స్‌ను ధృవీకరించుటకు, అవాంఛనీయ కమ్యూనికేషన్‌ను బ్లాక్ చేయుటకు అగ్రగామి గ్లోబల్ వేదిక అయిన ట్రూకాలర్, నెలకు 400 మిలియన్ల యూజర్స్ మైలురాయిని ప్రకటించుటకు గర్విస్తోంది. వివిధ భౌగోళిక మార్కెట్లలో ట్రూకాలర్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సంవత్సరం మార్చ్ 31 నుండి 10.1 మిలియన్ల యూజర్స్‌తో పెరిగింది.
 
“ప్రతి నెల 400 మిలియన్ల క్రియాశీల యూజర్స్ అనే మైలురాయిని చేరుకోవడం మేము గర్వించే విషయమే అయినా, కాని అదే సమయములో, ట్రూకాలర్ వంటి ఒక పరిష్కారము కొరకు ఆవశ్యకత కూడా గొప్పదని మాకు తెలుసు. ఫోన్ పైన అవాంఛనీయ కమ్యూనికేషన్, స్పామ్- మోసాల సమస్య దురదృష్టవశాత్తు వ్యక్తులకు, వ్యాపారాలకు రెండిటికి పెరుగుతోంది. కొత్త సాంకేతికత, డబ్బు సంపాదించటానికి మోసగాళ్లకు పెరిగిన అవకాశాలు ఈ పెరుగుదలకు కారణం అవుతున్నాయి. మేము మా యాప్‌ను నిరంతరం అభివృద్ధి చేస్తూనే ఉంటాము. ఒక ఫోన్ కాల్ లేదా ఎస్‎ఎంఎస్ ముందు, ఆ సమయములో, ఆ తరువాత మా యూజర్స్‌ను రక్షించుటకు కొత్త ఫంక్షనాలిటీని చేర్చుటకు కృషి చేస్తూనే ఉంటాము అని అలన్ మమెడి, కో-ఫౌండర్ మరియు సీఈఓ, ట్రూకాలర్ అన్నారు.
 
2024 యొక్క మొదటి త్రైమాసికములో ట్రూకాలర్ సగటున నెలకు 383.4 మిలియన్ల క్రియాశీల యూజర్లను నమోదు చేసింది. త్రైమాసికము చివరికి, నెలవారి క్రియాశీల యూజర్స్ సంఖ్య 389.9 మిలియన్లకు పెరిగింది. మధ్యంతర నివేదికలకు సంబంధించి ట్రూకాలర్ నెలవారి, రోజువారి యూజర్స్ యొక్క సగటు సంఖ్యను త్రైమాసిక ప్రాతిపదికన అందించడం కొనసాగిస్తుంది.