సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జులై 2023 (16:30 IST)

ట్రూకాలర్ తన కొత్త ఫీచర్.. ట్రూకాలర్ అసిస్టెంట్‌తో స్పామ్‌కు చెక్

True caller
ట్రూకాలర్ తన కొత్త ఫీచర్ అయిన ట్రూకాలర్ అసిస్టెంట్‌ను దేశంలో లాంచ్ చేసినట్లు ప్రకటించింది. స్పామ్, మోసపూరిత కాల్‌లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వినియోగదారులకు సమర్థవంతమైన ఈ టూల్‌ని అందిస్తుందని ట్రూ కాలర్ చెప్పింది. 
 
ట్రూ కాలర్ అసిస్టెంట్, ఆండ్రాయిడ్ పరికరాల్లో ట్రూ కాలర్ యాప్‌ ద్వారా అందుబాటులో ఉంది. ఆప్టిమైజ్ చేయగల, ఇంటరాక్టివ్ డిజిటల్ రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తుంది. 
 
ఈ ట్రూకాలర్ అసిస్టెంట్ ఇన్‌కమింగ్ కాల్‌లకు కచ్చితత్వంతో త్వరగా స్పందిస్తుందని ట్రూకాలర్ తెలిపింది. ఈ యాప్ ఫీచర్ ప్రస్తుతం 14 రోజుల ఉచిత ట్రయల్‌లో భాగంగా ట్రూకాలర్ అసిస్టెంట్ భారతీయ వినియోగదారులకు లాంచ్ చేయబడింది.