శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జులై 2023 (17:16 IST)

ఓపెన్ ఏఐ, చాట్‌బాట్‌లకు పోటీగా ఫ్రీ ఆఫ్ చార్జ్ వెర్షన్‌

meta
సంచలనాలు సృష్టిస్తున్న చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ, గూగుల్‌ బార్డ్ చాట్‌బాట్‌కు పోటీగా ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా రంగంలోకి దిగింది. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఫ్రీ ఆఫ్ చార్జ్ వెర్షన్‌ను విడుదల చేసింది.
 
ఈ వెర్షన్ నూతన టెక్నాలజీ నిర్మాణం కోసం డెవలపర్లకు అవకాశం కల్పిస్తుందని మెటా సీఈవో జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు. అంతేకాదు, సాఫ్ట్‌వేర్ ఓపెన్ అయ్యాక భద్రతను కూడా మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. 
 
రీసెర్చర్ల కోసం ప్రత్యేకంగా లామా అనే భాషా నమూనాను అభివృద్ధి చేసింది. ఈ లామా అనేది ఓపెన్ సోర్స్. అంటే దాని అంతర్గత పనితీరు ఓపెన్ఏఐ, గూగుల్‌కు భిన్నంగా ఉంటుంది. 
 
ఈ సరికొత్త శక్తిమంతమైన లామా 2గా పిలిచే ఈ మెటా మోడల్ వెర్షన్ మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ద్వారా ఏ వ్యాపారానికైనా అందుబాటులో ఉంటుంది.