ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 19 మే 2017 (11:21 IST)

ఏం మాట్లాడినా మీడియా నన్ను తరుముతోంది.. తమిళనాడు నుంచే వెళ్లిపోమంటున్నారు.. నెవర్ అంటున్న తలైవా

దాదాపు 23 ఏళ్లు కర్నాటకలోనే జీవించాను. 43 సంవత్సరాలుగా తమిళనాడులో ఉంటున్నాను అయినా నన్ను రాష్ట్రం నుంచి వెళ్లిపోమంటున్నారు. కానీ అలా వెళ్లే ప్రసక్తే లేదని దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ తేల్చి చెప్పారు. శుక్రవారం చెన్నైలోని కొండంబాక్కంలో తన అభిమాన

దాదాపు 23 ఏళ్లు కర్నాటకలోనే  జీవించాను. 43 సంవత్సరాలుగా తమిళనాడులో ఉంటున్నాను అయినా నన్ను రాష్ట్రం నుంచి వెళ్లిపోమంటున్నారు. కానీ అలా వెళ్లే ప్రసక్తే లేదని దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ తేల్చి చెప్పారు. శుక్రవారం చెన్నైలోని కొండంబాక్కంలో తన అభిమానులను చివరి రోజు కలుసుకున్న ఆయన కర్నాటక నుంచి వచ్చినా నన్ను అక్కున చేర్చుకున్నదీ, నన్ను పూర్తిగా తమిళుడిని చేసింది మీరే అంటూ ఎంతో ఉద్వేగంతో రజనీ కాంత్ తన హృదయం విప్పి పంచుకున్నారు. 
 
‘నేను కర్ణాటకలో 23సంవత్సరాలు జీవించాను. అలాగే తమిళనాడులో 43 ఏళ్లుగా ఉంటున్నాను. నేను కర్ణాటక నుంచి నాకు ఘనస్వాగతం పలికారు.. నన్నొక నిజమైన తమిళుడిగా మార్చారు. నేను ఇప్పుడు పక్కా తమిళుయుడిని. రాజకీయ వ్యవస్థ కుళ్లుబట్టిపోయి ఉంది. దానిని ప్రక్షాళన చేయాల్సి ఉంది’ అని ఆయన చెప్పారు. తనను తమిళనాడు నుంచి వెళ్లిపొమ్మంటున్నారని, అలా వెళ్లిపోయే ప్రసక్తి లేదని రజినీకాంత్‌ చెప్పారు.
 
తాను పక్కా తమిళుడినే అన్న ఆయన తాను ఏం మాట్లాడినా మీడియా తనను తరుముతోందని, సంచలనం చేస్తోందని, ఇందుకు రాజకీయాలే కారణం అని అన్నారు. తాను ఎంతో క్రమ శిక్షణతో ఉండటం వల్లే ఇలా ఉన్నానని చెప్పిన రజినీ ప్రభుత్వాలపై వ్యతిరేకత వచ్చినప్పుడు తన గొంతు వినిపిస్తానని చెప్పారు. ‘ మీతోపాటే నాక్కూడా బాధ్యతలు, పనులు ఉన్నాయి. ఇప్పుడవి చేద్దాం. కానీ, తప్పనిసరి పోరాటం వచ్చినప్పుడు మనందరం చూస్తాం’ అని ఆయన అన్నారు. సరైన సమయంం వచ్చినప్పుడు అభిమానం చూపించడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
 
రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో అభిమానులతో చివరి రోజు భేటీ శుక్రవారం చెన్నయ్‌లో ప్రారంభమైంది.  చివరి రోజు కూడా సరైన సమయంం వచ్చినప్పుడు అభిమానం చూపించడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునివ్వడంతో రజనీ రాజకీయ ప్రవేశం  ఉంటుందా ఉండదా అనేది పెద్ద సస్సెన్స్ అయి కూర్చుంది.