శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2017 (18:18 IST)

చెన్నైలోని యూఎస్ కాన్సుల్ జనరల్‌గా రాబర్ట్ బర్గెస్

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయం(యూఎస్ కాన్సుల్)లో కాన్సుల్ జనరల్‌గా రాబర్ట్ బర్గెస్‌లు నియమితులయ్యారు. ఆయన సోమవారం బాధ్యతలను స్వీకరించారు.

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయం(యూఎస్ కాన్సుల్)లో కాన్సుల్ జనరల్‌గా రాబర్ట్ బర్గెస్‌లు నియమితులయ్యారు. ఆయన సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దక్షిణ భారతదేశంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహించే గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ముఖ్యంగా అమెరికా-భారత్ సంబంధాల చరిత్రలో ఇదో ఉత్తేజకరమైన సమయంగా ఉందన్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల లక్ష్యాలను తెలుసుకుని వాటిని చేరుకునేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. 
 
కాగా, చెన్నైలోని యూఎస్ కాన్సులేట్‌లో కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు వాషింగ్టన్‌లోని యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్‌లో బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసియన్ అఫైర్స్ విభాగంలో ప్రాంతీయ అంశాల పరిష్కారం విభాగం సంచాలకులుగా ఈయన సేవలు అందించారు. అలాగే, తజికిస్థాన్‌లోని యుఎస్ ఎంబసీలో డిప్యూటీ చీఫ్ మిషన్‌గా కొనసాగారు. అలాగే, కరాచీ, బాకు, కిర్జిస్థాన్, బిష్కేక్, అజీర్బైజాన్, లిలాంగ్వే, మలావిలలో దౌత్యవేత్తగా ఉన్నారు. అలాగే, ఈయన అటార్నీగా కూడా పనిచేశారు. 
 
కొలోరాడో కాలేజీలో హిస్టరీ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌ పూర్తి చేసిన ఈయన... ఇలియాన్స్‌లోని వూకెగాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి జురీస్ డాక్టర్ డిగ్రీని కలిగివున్నారు. ఆస్టిన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటెజీ నుంచి మాస్టర్ ఇన్ సైన్స్ డిగ్రీని, యుఎస్ నేషనల్ వార్ కాలేజీలో గ్యాడ్యుయేట్‌ను 2012లో పూర్తి చేశారు.