అన్నాశాలై స్పెన్సర్ వద్ద ప్రమాదం.. బస్సుపై బోర్డు పడింది.. నలుగురికి గాయాలు (వీడియో)

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన స్పెన్సర్‌కు సమీపంలో ప్రమాదం జరిగింది. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. వెస్ట్ సైదాప

Selvi| Last Updated: గురువారం, 3 ఆగస్టు 2017 (15:19 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన స్పెన్సర్‌కు సమీపంలో ప్రమాదం జరిగింది. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. వెస్ట్ సైదాపేట-బ్రాడ్‌వేల మధ్య నడిచే బస్సు నెంబర్ 18కె స్పెన్సర్‌ వద్ద సమీపిస్తుండగా ద్విచక్ర వాహనదారుడు రూట్ తెలిపే స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో పెద్ద బోర్డు కిందపడింది.

ఆ బోర్డు కాస్త 18కె బస్సుపై పడటంతో డ్రైవర్, కండెక్టర్లతో పాటు నలుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారని.. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యిందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ బస్సును రోడ్డు నుంచి తొలగించే పనులు పూర్తైనట్లు వారు వెల్లడించారు. ఈ ప్రమాదం కారణంగా నగరంలోని ప్రధాన ప్రాంతమైన అన్నాశాలైలో గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి.
దీనిపై మరింత చదవండి :