Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు జబ్బు చేస్తే.. మంచం నుంచి కింద దించట్లేదా.. ఐతే కష్టమే..

పిల్లలకు జబ్బు చేస్తే వారిని పక్కనే వుంటారు. మంచం మీద నుంచి వారిని లేవనీయరు.. జబ్బు తగ్గేవరకు బయట తిరగనివ్వరు అయితే చాలారకాల జబ్బుల్లో రోజంతా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పిల్లలు కాస్

Written By Selvi
Updated: మంగళవారం, 18 జులై 2017 (08:48 IST)
పిల్లలకు జబ్బు చేస్తే వారిని పక్కనే వుంటారు. మంచం మీద నుంచి వారిని లేవనీయరు.. జబ్బు తగ్గేవరకు బయట తిరగనివ్వరు అయితే చాలారకాల జబ్బుల్లో రోజంతా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పిల్లలు కాస్త కోలుకోగానే.. వారిని మంచం మీద నుంచి దించేసి.. ఆడుకోనివ్వాలి. కానీ ఆరుబయట కాకుండా ఇంటి బాల్కనీలో ఆడుకోనివ్వడం చేయాలి.  
 
ఒకవేళ పిల్లలు మంచం మీది నుంచి లేవలేకపోతున్నా, విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినప్పుడే వారిని మంచం నుంచి కిందికి దించకూడదు. నిజానికి జబ్బుతో ఉన్నప్పుడు పిల్లల్లో ఏకాగ్రత తగ్గుతుంది. ఎక్కువసేపు ఆడుకోవాలని ఉన్నా ఆడుకోలేరు. కొన్నిసార్లు పిల్లలు పెద్దవాళ్లు దృష్టి తమ మీద పడేందుకూ ప్రయత్నిస్తుంటారు. అందుకే దగ్గరుండి తల్లిదండ్రులు సముదాయిస్తే సంతోషిస్తారు. 
 
అలాంటప్పుడు ఒక్కరినే పడకగదిలో పడుకోబెట్టటం కన్నా అందరూ తిరిగే చోట సోఫా మీద పడుకోబెట్టటం మంచిది. పిల్లలకు వినోదం కలిగించే ప్రయత్నం చేస్తే వారిలో కొత్త హుషారు వస్తుంది.వారికి ఇష్టమైన ఆటబొమ్మలను అందుబాటులో ఉంచాలి. వీలైతే దగ్గరుండి ఆడించాలి. ప్రేమగా నిమురుతూ సముదాయించాలి. ఇలా చేస్తే జబ్బు నుంచి పిల్లలు శీఘ్రంగా కోలుకుంటారు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments