1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్

ఆల్ సీజన్ కీర సలాడ్

ఆల్ సీజన్ కీర సలాడ్
కావలసిన పదార్థాలు :

కీరదోస-1
తులసి ఆకులు-1/4 కప్పు
ఆమ్‌చూర్ పొడి-చిటికెడు
ఉప్పు-కావల్సినంత
పుదీనా ఆకులు-1/2 కప్పు
నిమ్మరసం-3 చెంచాలు
మిరియాల పొడి-1/2 చెంచా
ఎండుమిర్చి-1

తయారీ విధానం :

ముందుగా కీరదోస చెక్కు తీసి నన్నని చక్రల్లాగా ముక్కలు కట్ చేయాలి. ఎండుమిర్చి చాలా సన్నగా కట్ చేసి ఉంచాలి. నిమ్మకాయను బాగా పిండి రసం తీసి ఉంచాలి. పుదీనా, తులసి, ఎండుమిర్చి వేసి కలపాలి. తరువాత వీటికి ఉప్పు, ఆమ్ చూర్‌పొడి, మిరియాల పొడి, నిమ్మరసం జతచేసి ముక్కలకి బాగా పట్టించాలి. సలాడ్ ప్లేట్‌లో ఈ మిశ్రమాన్ని పెట్టి సర్వ్ చెయ్యాలి.