1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
  4. drumstick leaves soup receipe

మునగాకు సూప్ తాగితే మగవారిలో...?

మునగాకులో విటమిన్ ఎ, సి, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. మునగాకు రసం ప్రతిరోజూ కొద్దిగా త్రాగితే అలసట పోయి ఉత్తేజం కలుగుతుంది. మునగాకు పువ్వులు, చిగుర్లు కూరగా వండుకుని తింటే కీళ్ళ నొప్పులు తొలగిపోతాయి. ర

drumstick
మునగాకులో విటమిన్ ఎ, సి, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. మునగాకు రసం ప్రతిరోజూ కొద్దిగా త్రాగితే అలసట పోయి ఉత్తేజం కలుగుతుంది. మునగాకు పువ్వులు, చిగుర్లు కూరగా వండుకుని తింటే కీళ్ళ నొప్పులు తొలగిపోతాయి. రక్తహీనత తగ్గి హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. మునగాకును పాలలో మరిగించి ఆ పాలను త్రాగితే వీర్యవృద్ధి కలుగుతుంది. అలాంటి మునగాకుతో సూప్ ఎలా తయారు చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు : 
మునగాకు - 2 కప్పులు 
క్యారెట్ తురుము - 1/2 కప్పు
కొబ్బరి తురుము - 1/2 కప్పు 
ఉల్లి తరుగు - 1/2 కప్పు 
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్  
కొత్తిమీర తరుగు - పావు కప్పు 
ఉప్పు - తగినంత  
మిరియాల పొడి - 1 స్పూన్ 
జీలకర్ర - 1 స్పూన్ 
నూనె- 2 స్పూన్స్ 
ఇంగవ పొడి - చిటికెడు 
 
తయారీ విధానం :
ముందుగా ప్యాన్‌లో ఉల్లి తరుగు, క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను వేసి అందులో ఐదు కప్పుల నీటిని చేర్చి కాసేపు ఉడికించాలి. మరో బాణలితో నెయ్యి వేసి వేడయ్యాక జీలకర్రను, మునగాకును వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని క్యారెట్, కొబ్బరి తురుము వేగుతున్న మిశ్రమంలో కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాగా ఉడికాక ఆరబెట్టుకుని మిక్సీలో రుబ్బుకోవాలి. ఆపై బౌల్‌లోకి తీసుకుని అందులో కొత్తిమీర తరుగు, మిరియాల పొడి, ఉప్పు వేసి కలుపుకుంటే మునగాకు సూప్ రెడీ.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
అల్లం రసంలో ఉడికించిన కోడిగుడ్డు, తేనె కలిపి తీసుకుంటే..?