శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 జులై 2020 (19:53 IST)

కరోనా రోగులనూ వదలరా.. క్వారంటైన్ సెంటర్‌లో మహిళపై అత్యాచారం..

కరోనా వైరస్‌తో జనాలు జడుసుకుంటున్నారు. కరోనా సోకిన వారికి చాలామంది దూరమవుతున్నారు. కానీ క్వారంటైన్ కేంద్రంలో కూడా మహిళలపై అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. కామాంధులు కరోనా రోగులను సైతం వదలడం లేదు. కరోనాబారిన పడి క్వారంటైన్ సెంటర్‌లో ఉంటున్న ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళ్తే.. 40 ఏళ్ల మహిళకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను ముంబైలోని పన్వెల్ ప్రాంతంలోని క్వారంటైన్ సెంటర్‌లో ఉంచారు.
 
కాగా, గురువారం రాత్రి సమయంలో క్వారంటైన్ కేంద్రంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.