గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 జులై 2020 (12:52 IST)

కరోనా పాజిటివ్ మహిళపై లైంగిక వేధింపులు.. డాక్టర్ అరెస్ట్

మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ మహిళలపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా కరోనా వైరస్ సోకిన మహిళలపై కూడా అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా దీన్‌దయాల్ ఆసుపత్రిలో చేరిన కరోనా పాజిటివ్‌ మహిళను లైంగిక వేధింపులకు గురి చేసిన వైద్యుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 
'ఎల్‌-2 కొవిడ్‌-19 కేర్‌ సెంటర్‌లో ఓ కరోనా బాధిత మహిళను అడ్మిట్‌ చేశారు. అదే దవాఖానలో సేవలందిస్తున్న ఓ వైద్యుడు అక్కడికి వెళ్లి ఆమెను లైంగికంగా ఇబ్బందులకు గురి చేశాడు.
 
బాధిత మహిళ ఫిర్యాదు మేరకు సెక్షన్‌ 376 2 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితున్ని అరెస్టు చేసినట్లు పోలీస్‌ సూపరింటెండెంట్‌ అరవింద్‌కుమార్‌ విలేకరులకు తెలిపారు. సంఘటనపై దర్యాప్తు కోసం జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు కుమార్ చెప్పారు.