గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2020 (10:01 IST)

దేశంలో 74 వేలకుపైగా కొత్త కేసులు.. 66లక్షల మార్కును..?

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. గత పదిరోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మరోమారు పెరిగాయి. 
 
సోమవారం 74 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 66 లక్షల మార్కును దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 74,442 మంది కరోనా బారినపడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 66,23,816కు చేరింది. ఇందులో 9,34,427 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 
 
మరో 55,86,704 మంది కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరారు. కాగా, కరోనాతో కొత్తగా మరో 903 మంది మరణించారు. ఇప్పటివరకు కరోనాతో 1,02,685 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.