1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. India reports 2,151 Covid-19 cases in last 24 hours, highest in 152 days

24 గంటల్లో దేశంలో 2,151 కొత్త కేసులు.. ఏడుగురు మృతి

coronavirus
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 2,151 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా తాజాగా ఏడుగురు మరణించారు. 
 
మహారాష్ట్రలో ముగ్గురు, కర్ణాటకలో ఒకరు, కేరళలో మరో ముగ్గురు మృతి చెందారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.65 కోట్ల వ్యాక్సిన్‌లు అందజేశారు. 
 
152 రోజుల విరామం తర్వాత ఒకే రోజులో పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేలు దాటింది. గతేడాది అక్టోబర్ 28న దేశంలో ఒక్కరోజే 2,208 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ క్రియాశీల కేసుల సంఖ్య 11,903కి చేరుకుంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కర్ణాటకలో ఎన్నికల నగారా: మేం అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్‌పై 50 శాతం సబ్సిడీ!