శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 28 మార్చి 2023 (18:18 IST)

వాతావరణం మార్పుతో పోరాడటానికి రెండు జాతీయ కమ్యూనిటీ చొరవలను ప్రకటించిన కియా ఇండియా - ఉపహార్, డ్రాప్

lemon tree
భారతదేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న కారు తయారీదారులలో ఒకటైన కియా ఇండియా, అట్టడుగు స్థాయిలలో ప్రభావాన్ని కలిగించడానికి తమ రెండు జాతీయ కమ్యూనిటీ చొరవలు - D.R.O.P. (డవలప్ రెస్పాన్సిబుల్ అవుట్ రీచ్ ఫర్ ప్లాస్టిక్), ఉపహార్‌లను అమలుచేయడం ఆరంభించింది. ఆటో ఎక్స్‌పో 2023లో మొదట ప్రకటించింది, సుస్థిరమైన ప్రపంచాన్ని రూపొందించడానికి ఈ రెండు చొరవలు కియా వారి అంతర్జాతీయ సీఎస్ఆర్ కల "పరిశుభ్రమైన వాతావరణం", "స్వేచ్ఛాయుతమైన-సురక్షితమైన ఉద్యమం"తో అనుసంధానం చేయబడ్డాయి.
 
ప్లాస్టిక్ వ్యర్థాలు గురించి ప్రమాదకరమైన ఆందోళనను పరిష్కరించి మరియు జలాశయాలు, ల్యాండ్ ఫిల్స్ లో అది వ్యాపించడాన్ని తగ్గించే లక్ష్యాన్ని D.R.O.P. కలిగి ఉండగా, ఉపహార్ చొరవ అట్టడుగు వర్గానికి చెందిన వ్యవసాయ సమాజానికి మద్దతు ఇవ్వడానికి చెట్లను నాటే కార్యక్రమంగా ఆరంభించబడింది, వాతావరణం మార్పుతో పోరాడుతోంది. మొదటి ప్రాజెక్ట్ 5 మెగా పట్టణాలలో చురుకుగా ఉంది-గురుగ్రామ్, ముంబయి, బెంగళూరు, విజయవాడ మరియు విశాఖపట్టణం, కాగా రెండవది 15 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణా, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిసా, ఉత్తర్ ప్రదేశ్, హర్యాణా, అస్సాం, మేఘాలయ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మరియు హిమాచల్ ప్రదేశ్‌లలో పని చేస్తోంది.
 
ఈ చొరవ గురించి మాట్లాడుతూ, "శ్రీ టే-జిన్ పార్క్, ఎండీ & సీఈఓ, కియా ఇండియా, ఇలా అన్నారు, "బాధ్యతాయుతమైన వ్యాపారంగా ఉండటం అనేది భారతదేశంలో దీర్ఘకాలం, సుస్థిరమైన వ్యాపారాన్ని రూపొందించడానికి ముందుగా అవసరమైన విషయం. 2021లో మా బ్రాండ్ పునః ప్రారంభించిన నాటి నుండి, 'ప్రేరేపించబడే ఉద్యమం' అనేది మా కీలకమైన సిద్ధాంతంగా ఉంది. దానిలో సుస్థిరత చాలా ప్రధానమైన అంశం. ఈ రెండు-కమ్యూనిటీ చొరవలతో, వాతావరణానికి అనుకూలంగా తోడ్పడటానికి బహుళ సమాజాలను ప్రేరేపించడానికి మేము పరిశీలిస్తున్నాము. మా భాగస్వాములు మరియు ఎన్జీఓల సహాయంతో రాబోయే సంవత్సరాలలో దీని ప్రభావం, చేరికలను వ్యాప్తి చేయాలని ఆశిస్తున్నాము."