గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 27 మార్చి 2023 (23:41 IST)

ఈ వేసవిని చల్లగా మలిచేందుకు బేవరేజస్‌- ఐస్‌క్రీమ్‌లను విడుదల చేసిన హెరిటేజ్‌ ఫుడ్స్‌

heritage
భారతదేశంలో సుప్రసిద్ధ డెయిరీ సంస్థలలో ఒకటైన హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ నేడు తమ నూతన శ్రేణి మజ్జిగ (బటర్‌మిల్క్‌)ఉత్పత్తులను  ‘ఏ-ఒన్‌’ బ్రాండ్‌ పేరిట విడుదల చేయడంతో పాటుగా నూతన శ్రేణి మిల్క్‌ షేక్స్‌ను అతి సులభంగా సర్వ్‌ చేయగల, సింగిల్‌ సర్వ్ కార్టన్‌ బాక్స్‌లలో విడుదల చేసింది. హెరిటేజ్‌ ‘ఏ-ఒన్‌’ స్పెషల్‌ బటర్‌మిల్క్‌ అతి తక్కువ కేలరీ నేచురల్‌ రిఫ్రెషనర్‌. అల్లం, పచ్చిమిరపలతో పాటుగా ఉప్పు, పులుపులను చక్కగా మిళితం చేసిన 180 మిల్లీ లీటర్ల ప్యాక్‌ను అత్యంత సరసమైన రీతిలో 20 రూపాయలలో అందిస్తున్నారు. దీని షెల్ఫ్‌ లైఫ్‌ ఆరు నెలలు.
 
హెరిటేజ్‌ ఇప్పుడు తమ శ్రేణి మిల్క్‌షేక్‌లను సైతం నూతన శ్రేణి ఫ్లేవర్లు, నూతన లుక్‌తో విడుదల చేసింది. వీటిలో వెనీలా, స్ట్రాబెర్రీ వంటి ప్రాచుర్యం పొందిన వేరియంట్లతో ఉన్నాయి. అలాగే త్వరలోనే చాక్లొట్‌ అండ్‌ కారామిల్‌; కుకీస్‌ అండ్‌ క్రీమ్‌ వేరియంట్లను విడుదల చేయనుంది. ఈ మిల్క్‌షేక్‌లు 180 మిల్లీలీటర్ల ప్యాక్‌ 40 రూపాయలలో, 125 మిల్లీ లీటర్‌ 15 రూపాయలలో లభ్యం కానున్నాయి.
 
హెరిటేజ్‌ ఏ-ఒన్‌ స్పైస్డ్‌ బటర్‌మిల్క్‌, మిల్క్‌ షేక్స్‌ తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు, న్యూఢిల్లీ, ఎన్‌సీఆర్‌లలో విడుదల చేశారు. ఇవి జనరల్‌ ట్రేడ్‌ స్టోర్లు, హెరిటేజ్‌ హ్యాపీనెస్‌ పాయింట్లు, హెరిటేజ్‌ పార్లర్స్‌, మోడ్రన్‌ రిటైల్‌ స్టోర్ల వద్ద, ఆన్‌లైన్‌ గ్రోసరీ ప్లాట్‌ఫామ్స్‌లో లభ్యమవుతాయి. ఈ ఆవిష్కరణ గురించి శ్రీమతి భువనేశ్వరి నారా, వైస్‌ ఛైర్‌పర్సన్‌- మేనేజింగ్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ, ‘‘మా పోర్ట్‌ఫోలియోలో విలువ ఆధారిత ఉత్పత్తులు(వీఏపీ) తోడ్పాటును వృద్ధి చేసే దిశగా వేసిన మరో ముందడుగు కాంబి-బ్లాక్‌ ప్యాక్స్‌లో ‘ఏ-ఒన్‌’ స్పైస్డ్‌ బటర్‌మిల్క్‌, నూతన మిల్క్‌షేక్స్‌ విడుదల చేయడం. ఈ నూతన ఉత్పత్తులు మా వినియోగదారులకు ఆనందం అందించడం మాత్రమే కాదు, తీవ్రమైన ఎండలను సైతం సంతోషంగా అధిగమించేందుకు తోడ్పడతాయి’’ అని అన్నారు.
 
ఈ సందర్భంగా హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీమతి బ్రాహ్మణి నారా మాట్లాడుతూ ‘‘బాదమ్‌ చార్జర్‌ను ఇతర ఫ్లేవర్డ్‌ మిల్క్‌ ప్రొడక్ట్స్‌తో పోలిస్తే 30% తక్కువ షుగర్‌తో తీర్చిదిద్దడంతో పాటుగా కృత్రిమ రంగులు కూడా జోడించలేదు. సహజసిద్ధమైన బాదములను దీనిలో జోడించాము’’ అని అన్నారు.