శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 20 జనవరి 2023 (21:07 IST)

ఆరెంజ్‌ ఫ్లేవర్డ్‌ ఎనర్జీ డ్రింక్‌ ‘గ్లూకో శక్తి’ని విడుదల చేసిన హెరిటేజ్‌ ఫుడ్స్‌

Nara Bhuvaneswari
భారతదేశపు సుప్రసిద్ధ డెయిరీ ప్లేయర్లలో ఒకటైన హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ నేడు వే-ఆధారిత ఇన్‌స్టెంట్‌ ఎనర్జీ డ్రింక్‌ గ్లూకోశక్తిని విడుదల చేసినట్లు వెల్లడించింది. కష్టించే యువతను కఠోరమైన శారీరక శ్రమ పూర్తిగా నీరసింపజేసినప్పుడు పునరుత్తేజింప చేయడానికి ఇది తోడ్పడుతుంది. గ్లూకోశక్తిలో వే యొక్క చక్కదనం ఉంది. ఇన్‌స్టెంట్‌ ఎనర్జీ కోసం గ్లూకోజ్‌తో పోర్టిఫైడ్‌ చేశారు. దీనిలో అత్యంత సహజసిద్ధమైన మినరల్స్‌ అయినటువంటి  సోడియం, పోటాషియం, ఫాస్పరస్‌, మెగ్నీషియం మొదలైనవి ఉన్నాయి.


ఇవి శరీరానికి అవసరమైన లవణాలను తిరిగి అందించడంలో సహాయపడతాయి. దీనిలో ఎలాంటి గ్యాస్‌ లేకుండా సహజసిద్ధమైన శక్తి ఉందంటూ చెప్పుకునే పోటీలో ఉన్న ఇతర ఉత్పత్తులతో పోలిస్తే  1.5రెట్లు అధిక పొటాషియం ఉంటుంది. అందువల్ల, గ్లూకోశక్తి అతి సహజమైన, నాన్‌ కార్బోనేటెడ్‌, అందుబాటు ధరల్లోని ఎనర్జీ డ్రింక్‌గా ప్రయాణాలలోని వ్యక్తులకు నిలుస్తుంది. మరీ ముఖ్యంగా అత్యంత కఠినమైన వేసవి రోజుల్లో  అవసరమైన శక్తిని ఈ డ్రింక్‌ అందిస్తుంది.
 
కేవలం 10 రూపాయల ధరలో 200 మిల్లీ లీటర్ల  పౌచ్‌ ప్యాక్‌‌లో లభిస్తుంది. ఇది అత్యంత అందుబాటు ధరలో ఎలాంటి అసౌకర్యమూ లేకుండా శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. ప్రస్తుతం ట్యాంగీ ఆరెంజ్‌ ఫ్లేవర్‌లో దీనిని విడుదల చేశారు. గ్లూకో శక్తిని తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడులలో విడుదల చేశారు. జనరల్‌ ట్రేడ్‌ స్టోర్లు, హెరిటేజ్‌ పార్లర్లు, ఎంపిక చేసిన మోడ్రల్‌ రిటైల్‌ స్టోర్లలో ఇది లభ్యమవుతుంది.
 
ఈ విడుదల గురించి వైస్‌ ఛైర్‌పర్సన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీమతి భువనేశ్వరి నారా మాట్లాడుతూ, ‘‘ఆరోగ్యవంతమైన, అత్యంత రుచికరమైన ఇన్‌స్టెంట్‌ ఎనర్జీ బూస్టర్‌ గ్లూకోశక్తి. నీరసం ఆవరించినప్పుడు తక్షణ శక్తిని పొందేందుకు ఇది తోడ్పడుతుంది. ప్రతి ఒక్కరికీ, ప్రతి రోజూ ఆరోగ్యం, సంతోషం అందిస్తామనే వాగ్ధానం నిలుపుకుంటూ హెరిటేజ్‌ చేసిన మరో మహోన్నత ప్రయత్నమిది’’ అని అన్నారు.
 
హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ ఇప్పుడు క్రీమిలిసియస్‌ కర్డ్‌‌ను సైతం విడుదల చేసింది. ఈ నూతన ఉత్పత్తి ఆవిష్కరణను మార్కెట్‌లో మరే ఇతర ఉత్పత్తి అందించని రీతిలో అత్యున్నత కర్డ్‌ అనుభవాలను అందించేందుకు విడుదల చేశారు. ఇది మరింత చిక్కగా, రుచిగా, క్రీమీ పెరుగుగా ఉంటుంది. క్రీమిలియస్‌ కర్డ్‌లో 4.5% ఫ్యాట్‌ ఉంటుంది. ఇది వినూత్నమైన కర్డ్‌ కల్చర్‌ రెసిపీతో  తయారుచేయబడింది. ఇది పెరుగుకు మహోన్నత టెక్చర్‌, క్రీమినెస్‌, మహోన్నత వినియోగ అనుభవాలను అందిస్తుంది. ఈ రుచికరమైన, చిక్కటి, క్రీమి పెరుగును ప్రీమియం టబ్స్‌ (1కేజీ), సౌకర్యవంతమైన కప్పులు (200- 400 గ్రాములు) ప్రాచుర్యం పొందిన పౌచ్‌లు (500 గ్రాములు)లో లభిస్తుంది.
 
తొలుత ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో విడుదల చేసిన ఈ క్రీమిలియస్‌ కర్డ్‌ను ఇప్పుడు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో విడుదల చేశారు. ఇది జనరల్‌ ట్రేడ్‌, అన్ని ప్రధాన మోడ్రన్‌ రిటైల్‌ స్టోర్లు,  ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌, హెరిటేజ్‌ పార్లర్లు, హెచ్‌డీసీలలో లభిస్తుంది. ‘‘మహోన్నతమైన హెరిటేజ్‌ క్రీమిలియస్‌ కర్డ్‌, ఎలాంటి మీల్‌కు అయినా ఆరోగ్యవంతమైన, రుచికరమైన సహచరునిగా నిలుస్తామనే వాగ్ధానాన్ని అందిస్తుంది. మా విలువ ఆధారిత డెయిరీ పోర్ట్‌ఫోలియోను మరింతగా బలోపేతం చేసే మరో ముందడుగు ఇది’’ అని  హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీమతి బ్రాహ్మణి నారా అన్నారు. ఈ తరహా ఆరోగ్యవంతమైన, రుచికరమైన ఉత్పత్తులను తమ వినియోగదారుల కోసం ఈ సంవత్సరం హెరిటేజ్‌ ఫుడ్స్‌ విడుదల చేయనుంది.