ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 17 జనవరి 2023 (18:33 IST)

క్వాంట్‌ ఫండ్‌ మెరిటార్‌ క్యును విడుదల చేసి మార్సెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌

భారతదేశంలో సుప్రసిద్ధ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ కంపెనీ మార్సెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వినూత్నమైన క్వాంట్‌ ఆధారిత ఫండ్‌ మార్సెల్లస్‌ మెరిటార్‌క్యును విడుదల చేసింది. రిటైల్‌ ఇన్వెస్టర్లకు రిస్క్‌ సర్దుబాటు చేసిన రాబడులను అందించే రీతిలో దీనిని డిజైన్‌ చేశారు. మెరిటార్‌క్యులో కనీస పెట్టుబడి మొత్తం 10 లక్షల రూపాయలు. ఈ ప్రొడక్ట్‌, డైవర్శిఫైడ్‌ పోర్ట్‌ఫోలియోను సృష్టించడం లక్ష్యంగా చేసుకుంది. దీనిలో 35-45స్టాక్ట్స్‌ భారీ, మధ్య మరియు స్మాల్‌ క్యాప్‌ విభాగాలలో ఉంటాయి. ఈ ఫండ్‌ను నిఫ్టీ 500 టీఆర్‌ఐకు బెంచ్‌మార్క్‌ చేశారు.
 
ఈ పోర్ట్‌ఫోలియోను అంతర్గతంగా అభివృద్ది చేసిన రూల్‌ ఆధారిత వ్యవస్థ ద్వారా నిర్మించారు. ఇది చక్కటి నాణ్యత, విలువ తక్కువ కలిగిన కంపెనీలను భారీగా జాబితీకరించిన స్టాక్స్‌ నుంచి గుర్తించడం చేస్తుంది. క్యాపిటల్‌పై అధిక రాబడి, మెరుగైన ఆర్థిక స్ధితి, ఎలాంటి లోపాలు లేని ఖాతాలతో కూడిన దీర్ఘకాలపు విన్నింగ్‌ పోర్ట్‌ఫోలియో స్టాక్స్‌ను నిర్మించడంలో ప్రవర్తనా పక్షపాతాలను నివారించడానికి మరియు విచక్షణ కంటే ప్రాసెస్‌ను ఇష్టపడేందుకు క్వాంట్‌ విధానం ఉత్తమంగా నిలుస్తుంది.
 
జులై 2006 నుంచి ఆగస్టు 2022 వరకూ 16 సంవత్సరాల కాలంలో మెరిటార్‌క్యు తోడుగా ఈ ఫండ్‌ 20 రెట్ల రాబడిని నిఫ్టీ 500 టీఆర్‌ఐతో పోల్చినప్పుడు అందించింది. మెరిటార్‌ క్యు అతి తక్కువ తగ్గింపులు మరియు అత్యంత వేగవంతమైన రికవరీని అత్యంత ఒడిదుడుకుల మార్కెట్‌ పరిస్ధితులలో సైతం అందించింది. ఈ ఫండ్‌ గురించి మార్సెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ సౌరభ్‌ ముఖర్జీ మాట్లాడుతూ, ‘‘కనీస పెట్టుబడి మొత్తంతో ఓ ప్రొడక్ట్‌ను మార్సెల్లస్‌ తీసుకువస్తే బాగుంటుందని ఎంతోమంది చిన్న రిటైల్‌ ఇన్వెస్టర్లు చాలాకాలంగా కోరుకుంటున్నారు. పెట్టుబడి నిర్ణయాలకు రూల్‌ ఆధారిత, క్వాంటిటేటివ్‌ విధానం తీసుకుని మెరిటార్‌ క్యు ఇప్పుడు మదుపరులకు తమ దీర్ఘకాలపు పెట్టుబడి లక్ష్యాలను సాధించడంలో తోడ్పడే ఒక ఆచరణీయ ఎంపిక అవకాశాన్ని అందిస్తుంది’’ అని అన్నారు.
 
మెరిటార్‌క్యు కోసం ఇన్వెస్ట్‌మెంట్‌ ఎడ్వైజర్‌గా నిలిచిన కృష్ణన్‌ వీఆర్‌ మాట్లాడుతూ, ‘‘మెరిటార్‌ క్యు అనేది నియమ ఆధారిత వ్యూహం. ఇది ఫండమెంటల్స్‌పై దృష్టి సారిస్తుంది. క్లీన్‌ ఎక్కౌంట్స్‌తో కూడిన అత్యున్నత నాణ్యత కలిగిన కంపెనీలు మరియు సాపేక్షంగా తక్కువ విలువ కలిగిన కంపెనీల కొనుగోలుపై రాజీలేని విధానాన్ని మెరిటార్‌క్యు అనుసరిస్తుంది. కనీసం మూడు సంవత్సరాల పెట్టుబడి హారిజన్‌ కలిగిన మదుపరులకు ఇది అనుకూలంగా ఉంటుంది’’ అని అన్నారు.
 
మెరిటార్‌క్యు యొక్క అత్యంత కీలకమైన ఫీచర్లు...
ఈ పోర్ట్‌ఫోలియో నిర్మాణ ప్రక్రియను 16 సంవత్సరాల చరిత్రను కూలంకుషంగా అధ్యయనం చేసి చేశారు. పలు మార్కెట్‌ సైకిల్స్‌ వ్యాప్తంగా సరాసరిన 50% వార్షిక టర్నోవర్‌ స్ధిరమైన ప్రదర్శన కొనసాగించింది.
 
క్లీన్‌ ఖాతాలు కలిగిన కంపెనీలను పరీక్షించేందుకు మార్సెల్లస్‌ ఫోరెన్సిక్‌ ఫ్రేమ్‌వర్క్‌పై ఆధారపడి ఉంటుంది.
 
తక్కువ ప్రతికూల రిస్క్‌తో అత్యుత్తమ రాబడిని అందించడానికి నాణ్యత మరియు విలువ వంటి సంబంధం లేని అంశాలను మిళితం చేస్తుంది. 2008లో అంతర్జాతీయ ఆర్ధిక సంక్షోభం మరియు మార్చి2020 కరోనా మార్కెట్‌ క్రాష్‌ వేళలో కూడా అతి తక్కువ డ్రా డౌన్‌ను ఈ వ్యూహం కలిగి ఉంది.
 
ఏప్రిల్‌ మరియు అక్టోబర్‌ నెలల్లో మొదటి ట్రేడింగ్‌ రోజున సెమీయాన్యువల్‌ పద్ధతిలో ఈ ఫండ్‌ను రీబ్యాలెన్స్‌, రివ్యూ చేయడం జరుగుతుంది.