సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 మార్చి 2023 (15:18 IST)

కాంచీపురం ఇడ్లీ.. మీ ఇంట్లోనే ఇలా తయారు చేయవచ్చు.. తెలుసా?

Kanchipuram idly
Kanchipuram idly
కావలసిన పదార్థాలు :
ఇడ్లీ బియ్యం - 2 కప్పులు
మినపప్పు - 1 కప్పు
మిరియాలు - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు
శొంఠి పొడి - చిటికెడు
ఇంగువ పొడి - చిటికెడు
కొబ్బరి తురుము - 1/2 కప్పు
జీడిపప్పు తరుగు - 1 టేబుల్ స్పూన్
నెయ్యి - తగినంత 
ఉప్పు - కావలసినంత
 
తయారీ విధానం:
బియ్యం మినప్పప్పును బాగా కడిగి 8 గంటలు విడివిడిగా నానబెట్టాలి. మరుసటి రోజు స్టవ్ మీద బాణలిలో నెయ్యి వేసి జీడిపప్పు, శొంఠి పొడి వేసి, జీడిపప్పును దోరగా వేయించి అందులో వేయాలి. అదే బాణలిలో నెయ్యి పూసి ఒక టీస్పూన్ మిరియాలు, ఒక టీస్పూన్ జీలకర్ర పొడి వేసి పిండికి జోడించండి. ఇంగువ పొడి వేసి ఒక సెకను లేదా రెండు సెకనులు వేయించి, దీన్ని పిండిలో కలపండి.

పిండిలో కొబ్బరి ముక్కలు వేసి బాగా కలపాలి. ఇడ్లీ కుక్కర్ లేదా ఇడ్లీ పాత్రను స్టౌ మీద పెట్టి, అవసరమైన నీళ్లు పోసి మరిగించాలి. సమాన పరిమాణంలో ఇడ్లీలా పోసి అరగంట పాటు ఉడకనివ్వాలి.

ఇప్పుడు రుచికరమైన కాంచీపురం ఇడ్లీ రెడీ. పిండిని కుక్కర్ పాన్ లేదా బేసిన్ వంటి పాత్రలో పోసి ఉడికించి, ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయవచ్చు. లేదా మామూలు ఇడ్లీలానే ఇడ్లీ ప్లేటులో పోసి ఉడకబెట్టవచ్చు. దీనికి సాంబార్, చట్నీ లేకుండానే సర్వ్ చేయొచ్చు. మీకు కావాలనుకుంటే సాంబార్, చట్నీతో సర్వ్ చేయవచ్చు.