గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 మార్చి 2023 (11:26 IST)

బస్టాండ్‌ వద్ద యువతికి తాళికట్టిన యువకుడు

marriage
తమిళనాడులో రద్దీగా వుండే ఆంబూర్ బస్టాండ్ వద్ద ఓ యువకుడు యువతికి తాళి కట్టిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఆంబూర్ బస్ స్టేషన్ వద్ద టాయిలెట్ దగ్గర ఓ యువ జంట పెళ్లి చేసుకున్నారు. ఓ యువకుడు తన ప్రియురాలికి హడావుడిగా తాళి కట్టి, ఆ తర్వాత రహస్యంగా అదృశ్యమయ్యాడు. 
 
దీనికి సంబంధించిన వీడియో వెబ్‌సైట్లలో వైరల్ కావడంతో పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి వివాహిత ఎవరనే దానిపై విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
గత కొన్ని రోజులుగా అంబూర్ బస్ స్టేషన్‌లో శృంగార జంటలు, సంఘ వ్యతిరేకులు నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఇప్పుడు బస్ స్టేషన్‌లో జరిగిన తాళి పెళ్లి షాక్‌కు గురి చేసింది.