గురువారం, 30 నవంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 మార్చి 2023 (22:42 IST)

నా కుమారుడు నన్ను రెండో పెళ్లి చేసుకోమంటున్నాడు..

Kowsalya
Kowsalya
తన వైవాహిక జీవితంలో తాను చాలా ఇబ్బందులు పడ్డానని.. సింగర్ కౌసల్య తెలిపింది. అప్పట్లో తమ బాబు చాలా చిన్న పిల్లవాడు. అతనికి తండ్రి ప్రేమ చాలా అవసరం. అందువలన ఓపికగా కష్టాలను భరించాను. కానీ తన భర్త ఇంకో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకునే వరకూ సర్దుకుపోయానని.. కానీ కుదరలేదని.. కౌసల్య చెప్పింది. 
 
తన వివాహ జీవితంలో తనకు ఎలాంటి బాధలేదని.. భర్తకు దూరమై బిడ్డతో జీవిస్తున్నానని తెలిపింది కౌసల్య. ప్రస్తుతం తన కుమారుడు తనను రెండో వివాహం చేసుకోమని అంటున్నాడని.. ఎవరి కోసమో జీవితాన్ని ఎందుకు త్యాగం చేయాలని అడుగుతున్నాడని చెప్పారు. 
 
తండ్రి చిన్నప్పుడే మరణించడంతో.. అమ్మ తనను పెంచి పెద్ద చేసిందని.. ఆమె కూడా ఎనిమిదేళ్ల క్రితం ఆమె కూడా మృతి చెందారని.. ప్రస్తుతం తన లోకమంతా తన బాబునేనని కౌసల్య వెల్లడించింది. బాబును డైనమిక్‌గా పెంచానని.. తనకి ఎదురైన సమస్యలను తాను ధైర్యంగా పరిష్కరించుకోగలడని చెప్పుకొచ్చారు.