ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 మార్చి 2023 (11:16 IST)

బీసీసీఐ క్రికెటర్ల గ్రేడ్ వివరాలు.. గ్రేడ్ ఎ నుంచి బి గ్రేడ్‌కు జారిన కేఎల్ రాహుల్

KL Rahul
భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ప్రతి సంవత్సరం క్రికెటర్లకు వారి సామర్థ్యం ఆధారంగా గ్రేడ్ వారీగా వేతనాన్ని అందజేస్తోంది. తాజాగా 2022-23 సంవత్సరానికి సంబంధించిన గ్రేడ్‌లను బీసీసీఐ ప్రకటించింది.
 
బీసీసీఐ భారత క్రికెటర్లకు గ్రేడ్ ఆధారంగా జీతాలు ఇస్తోంది. దీని ప్రకారం ఏ ప్లస్ గ్రేడ్‌లో ఉన్న స్టార్ ప్లేయర్‌లకు రూ.7 కోట్లు, ఏ కేటగిరీ ఆటగాళ్లకు రూ.5 కోట్లు, బీ కేటగిరీ ఆటగాళ్లకు రూ.3 కోట్లు, సీ కేటగిరీ ఆటగాళ్లకు కోటి రూపాయలను అందజేస్తారు.
 
ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఏ గ్రేడ్‌లో కొనసాగుతున్న కేఎల్ రాహుల్.. ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన కనబరుస్తుండటంతో గ్రేడ్‌బీకి దిగజారాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన కనబరిచిన జడేజాను ఏ కేటగిరీ నుంచి ఏ ప్లస్ కేటగిరీకి మార్చారు. 
 
BCCI ప్రస్తుత గ్రేడ్ జాబితా వివరాల్లోకి వెళితే.. 
గ్రేడ్ A ప్లస్ - రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా 
గ్రేడ్ A - హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, రిషబ్ పంత్, అక్షర్ పటేల్ 
గ్రేడ్ B - పుజారా, KL రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, సుబ్మన్ గిల్.
గ్రేడ్ సి - ఉమేష్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజు శాంసన్, హర్ష్‌దీప్ సింగ్, కెఎస్ భరత్.