ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (15:13 IST)

హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్‌లకు బీసీసీఐ ప్రమోషన్!

hardik pandya
2023-2024 సంవత్సరానికి సంబంధించిన క్రికెటర్ల వేతన వివరాలను బీసీసీఐ త్వరలో ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఒప్పందంలో పలు నాటకీయ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. 
 
ప్రస్తుతం హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్‌లు రూ.కోటి వేతనం పొందుతుండటంతో వారిని ఏ డివిజన్‌కు మార్చాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఇద్దరికీ ఐదు రెట్లు అదనంగా వేతనం లభించడం గమనార్హం. దీనికి తోడు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం వున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
రెండు వైట్ బాల్ ఫార్మాట్‌లలో హార్దిక్ పాండ్యాను భారత కెప్టెన్‌గా నియమించాలని మాజీ క్రికెటర్ మణిందర్ సింగ్ అభిప్రాయపడ్డాడు. గుజరాత్ టైటాన్స్ (GT)కెప్టెన్‌గా ఎంపికైనప్పుడు ఆల్‌రౌండర్ తన సామర్థ్యాన్ని గ్రహించాడని ఈ మాజీ స్పిన్నర్ మణిందర్ సింగ్ అన్నారు.