సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 అక్టోబరు 2022 (15:40 IST)

ట్వంటీ20 టోర్నీలో సెమీస్‌కు చేరడం గగనమే : రోజర్ బిన్నీ

roger binny
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ మెగా టోర్నీలో పాకిస్తాన్ జట్టు సెమీస్‌కు చేరడం కష్టసాధ్యమని బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ జోస్యం చెప్పారు. పాకిస్థాన్ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో, రెండో మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఓటమిపాలైంది. దీంతో పాక్ జట్టుపై సొంత గడ్డ నుంచే తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు వరుస ఓటముల నేపథ్యంలో టోర్నీలో సెమీస్ రేసులో నిలవడం కష్టమన్నారు. ఒకవేళ వరుస మ్యాచ్‌లలో పాకిస్థాన్ జట్టు విజయం సాధించి సెమీస్‌కు చేరితే సంతోషపడేవాళ్ళలో మొదటి వ్యక్తిని నేనుగానే ఉంటాను అని చెప్పారు. అయితే, క్రికెట్ అంటేనే ఫన్నీ గేమ్. మీకు తెలియని కాదు.. అది ఎప్పటికైనా, ఎలాగైనా జరగొచ్చు అని అన్నారు.