సెహ్వాగ్ 2.0 కావడానికి మైదానంలోకి అడుగుపెట్టలేదు : ఆర్యవీర్ సెహ్వాగ్
భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తన క్రికెట్ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సెహ్వాగ్ 2.0 కావడానికి రాలేదని పునరుద్ఘాటించారు. తనను తన తండ్రి వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చడంపై ఆయన స్పందించారు. తాను మరొకరి నీడలా ఉండటానికి రాలేదు. క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించడానికే వచ్చినట్టు స్పష్టం చేశారు. అండర్-19 ఆసియా కప్ 2026 టోర్నీలో భారత క్రికెట్ జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన ఆర్యవీర్... తనను తండ్రితో పోల్చడంపై తొలిసారి స్పదించాడు.
కెరీర్ ఆరంభంలోనే నా తండ్రితో పోలికలు తప్పవనే నిజాన్ని గ్రహించాను. దాన్ని నేను ఆపలేను. మా ఇద్దరి ఆటలో ఎవరైనా పోలీకలు చూస్తున్నారంటే అది వారి అభిప్రాయం. మా నాన్నపై వారికి ఉన్న ప్రేమ మాత్రమే. కానీ, నేను ఇక్కడికి సెహ్వాగ్ 2.0 కావడానికి రాలేదు. ఆర్యవీర్ సెహ్వాగ్‌గా నాకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి వచ్చాను. రెండో సెహ్వాగ్‌గా నిలవడం కంటే మొదటి ఆర్యవీర్‌గా ఉండటానికే ఇష్టపడతాను అని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

