కోహ్లీని అడ్డుకోవడం ఆసీస్‌కి అంత సులభం కాకపోవచ్చు : గంగూలీ
2014-15లో జరిగిన బోర్డర్-గవాస్కర్ సీరీస్‌లో ఆసీస్ జట్టుపై నాలుగు సెంచరీలు బాదిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఈసారి కూడా అడ్డుకోవడం ఆసీస్ జట్టుకు అంత సులభం కాకపోవచ్చని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హెచ్చరించాడు. కోహ్లీ అప్పట్లో అంత రెచ్చి
2014-15లో జరిగిన బోర్డర్-గవాస్కర్ సీరీస్‌లో ఆసీస్ జట్టుపై నాలుగు సెంచరీలు బాదిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఈసారి కూడా అడ్డుకోవడం ఆసీస్ జట్టుకు అంత సులభం కాకపోవచ్చని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హెచ్చరించాడు. కోహ్లీ అప్పట్లో అంత రెచ్చిపోవడానికి ఆసీస్ జట్టు సాగించిన స్లెడ్జింగ్ ప్రధాన కారణం. గంగూలీ దీన్నే ప్రధానంగా ఎత్తిచూపుతూ స్లెడ్జింగ్ కోహ్లీని ప్రభావితం చేయకపోవచ్చు కానీ ఈసారి కూడా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, అతడి జట్టుకు కోహ్లీని అడ్డుకోవడం అంత సులభం కాకపోవచ్చని చెప్పాడు.
ఆస్ట్రేలియాలో ఆసీస్ జట్టు కోహ్లీని టార్గెట్ చేసింది కానీ అతడు రెచ్చిపోయి ఉతికి ఆరేశాడు. కోహ్లీ జీవితాన్నే మార్చివేసిన సీరీస్ అది. ఆనాటి నుంచే అతడు భీకరమైన ఆటగాడయ్యాడు. ఈసారి మాత్రం తొలి టెస్టు మ్యాచ్‌లోనే ఆసీస్ జట్టు కోహ్లీని తీవ్రంగా అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు. ఆ విషయంలో వారు సక్సెస్ అయితే సరే. లేదంటే తదుపరి మ్యాచ్‌లలో కోహ్లీని అడ్డుకోవడం వారి తరం కాకపోవచ్చు అని గంగూలీ పేర్కొన్నాడు.
ఇండియాలో టీమిండియాపై గెలుపు సాధించడం ఆసీస్ జట్టుకు చాలా కష్టమే. స్మిత్, వార్నర్ ఇప్పుడు ఎంతో బాగా ఆడుతున్నారు. తమ జట్టును వారు ముందుకు తీసుకుపోతున్నారు.షాన్ మార్ష్, మిచెల్ మార్ష్ భారత్‌లో ఆడారు. వీరు ఇక్కడ బాగా ఆడటమే కాదు ప్రస్తుత సీరీస్‌ని బాగా ప్రభావితం చేయబోతున్నారు. వాళ్లు భారత్‌కు అడ్డుకట్ట వేయబోతారేమో వేచి చూడాల్సిందే అని గంగూలీ చెప్పాడు.