గురువారం, 17 జులై 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 మే 2016 (19:30 IST)

''వాకింగ్ వికెట్'' క్రిస్ మార్టిన్‌.. బ్యాట్ పట్టుకోవడమే రాదు.. 100 ఇన్నింగ్స్ 123 రన్స్ మాత్రమే!

న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ మార్టిన్ (41)కి వంద ఇన్నింగ్స్‌లు ఆడినా బ్యాట్ ఎలా పట్టుకోవాలో చేతకాదట. క్రికెట్ చరిత్రలో అతనిది అత్యంత చెత్త రికార్డు. కనీసం వచ్చే బాల్‌ని ఎలా ఆపాలో కూడా అతని తెలియదు. అందుకే అతనికి వాకింగ్ వికెట్ అనే ముద్దు పేరు కూడా ఉందీక్రికెటర్‌కు. 2000-13 వరకు కెరీర్ కొనసాగించిన క్రిస్ మార్టిన్ బౌలర్‌గా కివీస్ తరపున 71 టెస్టులాడి 233 వికెట్లు తీశాడు. అయితే వంద మ్యాచ్‌లు ఆడినా అయ్యగారికి బ్యాటింగ్ మాత్రం చేతకాదట. పరుగులు చేయడంలో నిల్. వంద ఇన్నింగ్స్ ఆడినప్పటికీ క్రిస్ మార్టిన్ కేవలం 123 పరుగులు మాత్రమే సాధించడం గమనార్హం. 
 
ఇంకా చెప్పాలంటే క్రిస్ మార్టిన్ అత్యధిక స్కోరు 12 పరుగులు కావడం విశేషం. ఈ పరుగులు కూడా అప్పట్లో బౌలింగ్ చేసేందుకు తెలియని పసికూన బంగ్లాదేశ్‌పై సాధించినవి కావడం గమనార్హం. ఇకపోతే.. క్రిస్ మార్టిన్ కెరీర్ బ్యాటింగ్ యావరేజ్ 2.36 కాగా.. 36 సార్లు మార్టిన్ ఖాతా తెరవలేకపోవడం గమనార్హం. అంటే.. 36 సార్లు డక్ అవుట్‌గా వెనుదిరిగాడు.