గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 8 జూన్ 2017 (12:48 IST)

అప్పుడేమో కాశ్మీర్ కావాలన్నారు.. ఇప్పుడేమో కోహ్లీ కావాలా? ఎప్పటికీ ''కే'' సొంతం కాదు..

పాకిస్థాన్‌లో కోహ్లీపై రచ్చ రచ్చ సాగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ చేతిలో ఓడిపోవడాన్ని పాకిస్థానీలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో భారత జట్టును సమర్థవంతంగా నడిపే విరాట్ కోహ్లీని పాకిస్థాన్‌కు ఇచ్

పాకిస్థాన్‌లో కోహ్లీపై రచ్చ రచ్చ సాగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ చేతిలో ఓడిపోవడాన్ని పాకిస్థానీలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో భారత జట్టును సమర్థవంతంగా నడిపే విరాట్ కోహ్లీని పాకిస్థాన్‌కు ఇచ్చేయండంటూ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. 
 
ఇంతకీ విషయం ఏమిటంటే? పాకిస్థాన్ జర్నలిస్టు నజరానా గఫర్ ట్వీట్ చేస్తూ... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడిని మాకు ఇచ్చేయండి...అందుకు ప్రతిగా మొత్తం పాకిస్థాన్ జట్టునే తీసుకోండి అంటూ సరికొత్త ప్రతిపాదన చేశాడు. ఈ ట్వీట్ పాకిస్థానీలను ఆకట్టుకుంది. ఈ ట్వీట్‌కు వరుస ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఈ ట్వీట్‌కు భారతీయులు మాత్రం ఆసక్తికరంగా స్పందించారు. దయచేసి గాడిదలను గుర్రాలతో పోల్చవద్దని చురకలంటించారు. పాకిస్థాన్ క్రికెటర్లు మరో రెండు తరాలైనా టీమిండియాకు సాటిరారనని.. అప్పుడు కాశ్మీర్ కావాలన్నారు.. ఇప్పుడు కోహ్లీ కావాలంటున్నారు.. కానీ పాకిస్థాన్‌కి ఎప్పటికీ 'కే' సొంతం కాదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.