బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 18 జూన్ 2017 (12:05 IST)

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్: భారత్-పాకిస్థాన్‌ను తండ్రి-కొడుకుతో పోల్చిన రిషికపూర్.. ధోనీ ట్వీట్ వైరల్

బాలీవుడ్ స్టార్ రిషికపూర్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరుపై సంచలన ట్వీట్ చేశాడు. అందులో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు హెచ్చరికలు జారీ చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు క్రికెట్ జట్టును మాత్రమే పంపించాలి.

బాలీవుడ్ స్టార్ రిషికపూర్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరుపై సంచలన ట్వీట్ చేశాడు. అందులో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు హెచ్చరికలు జారీ చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు క్రికెట్ జట్టును మాత్రమే పంపించాలి. హామీ టీమ్‌నో, ఖోఖో టీమ్‌నో కాదు. ఎందుకంటే? 18వ తేదీ ఫాదర్స్ డే రోజున మీతో ఆడేది అబ్బలు (ఫాదర్స్) అంటూ ట్వీట్ చేశాడు. సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై పాకిస్థాన్ నెగ్గిన తర్వాత కూడా రిషికపూర్ పాక్ జట్టును అభినందిస్తూ ట్వీట్ చేశాడు.
 
పాకిస్థాన్‌కు శుభాకాంక్షలు చెబుతూనే తమ జట్టు రంగు అయిన నీలం (బ్లూ)ను ధరించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించాడు. తాజాగా భారత్-పాకిస్థాన్‌ను "తండ్రి-కొడుకు"తో రిషికపూర్‌ పోల్చాడు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో నేడు భారత్-పాక్‌లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాక్, భారత్ క్రికెట్ అభిమానులకు ఒక ఫోటోతో చక్కని సందేశం పంపాడు. 
 
పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ కుమారుడు అబ్దుల్లాను ధోనీ ఎత్తుకుని ఆడించాడు. ఈ సందర్భంగా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివాదాలు, విభేదాలు దేశాల మధ్య కానీ మనుషుల మధ్య కాదని నిరూపించాడని సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.