సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 20 మే 2017 (09:51 IST)

చాంపియన్స్ ట్రోఫీ భారత్‌ను చిత్తుగా ఓడిస్తాం : ఇంజమామ్ ప్రగల్భాలు

చాంపియన్స్ ట్రోఫీ భారత్‌ను చిత్తుగా ఓడిస్తామని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ హక్ ప్రగల్భాలు పలికాడు. నిజానికి ఐసీసీ నిర్వహించే ఏ ఒక్క అంతర్జాతీయ పోటీల్లోనూ భారత్‌పై దాయాది దేశం పాకిస్థాన్ నెగ్గిన చ

చాంపియన్స్ ట్రోఫీ భారత్‌ను చిత్తుగా ఓడిస్తామని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ హక్ ప్రగల్భాలు పలికాడు. నిజానికి ఐసీసీ నిర్వహించే ఏ ఒక్క అంతర్జాతీయ పోటీల్లోనూ భారత్‌పై దాయాది దేశం పాకిస్థాన్ నెగ్గిన చరిత్రే లేదు. కానీ, ఈ దఫా ఇంగ్లండ్ వేదికగా జరిగే చాంపియన్ ట్రోఫీలో మాత్రం భారత్‌ను చిత్తుగా ఓడిస్తామని ఇంజమామ్ అంటున్నాడు. 
 
కాగా, చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా వచ్చే నెల నాలుగో తేదీన దాయాది దేశాలు భారత్-పాక్‌లు మళ్లీ తలపడబోతున్నాయి. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఎడ్జ్‌బాస్టన్‌ వేదిక కాబోతోంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించడమే కాకుండా ఏకంగా ట్రోఫీనే ఎగరేసుకుపోతామని అంటున్నాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్. ప్రస్తుతం ఆయన పాక్ జాతీయ జట్టుకు సెలక్టర్‌గా ఉన్నాడు. 
 
భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై హక్ మాట్లాడుతూ.. తాము భారత్‌ను ఓడించడానికి మాత్రమే ఇంగ్లండ్ వెళ్లడం లేదని, కప్పు కూడా కొట్టుకొస్తామని ధీమా వ్యక్తం చేశాడు. 2004లో ఇంజీ సారథ్యంలోని పాక్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఇప్పుడు అదే వేదికపై భారత్-పాక్‌లు తలపడనుండడంతో పాక్ మరోసారి విజయం సాధింస్తుందని హక్ ఆశాభావం వ్యక్తం చేశాడు.