సోమవారం, 13 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 21 మే 2017 (17:28 IST)

హైదరాబాద్ బిర్యానీ అంటే అమితమైన ఇష్టం : సచిన్ టెండూల్కర్

హైదరాబాద్‌లో ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నా ఇక్కడి ఫ్యాన్స్ చల్లదనాన్ని ఇస్తారని క్రికెట్ దిగ్గజం సచిన్ అన్నారు. తన బయోపిక్ ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్

హైదరాబాద్‌లో ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నా ఇక్కడి ఫ్యాన్స్ చల్లదనాన్ని ఇస్తారని క్రికెట్ దిగ్గజం సచిన్ అన్నారు. తన బయోపిక్ ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ మాట్లాడుతూ, హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టమని, హైదరాబాద్‌లో తనకు చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయని అన్నారు. తన బయోపిక్ గురించి ప్రస్తావిస్తూ,ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ అందించిన సంగీతం చాలా బాగుందని, రెహ్మాన్ తనకు చిరకాల మిత్రుడని చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే... తనపై బయోపిక్ తీస్తామని అడిగినప్పుడు చేయాలా? వద్దా? అని మొదట్లో ఆలోచించానని, అభిమానులు తన గురించి బాగా తెలుసుకోవాలనుకుంటున్నారని తనకు అర్థమైందన్నారు. ఈ బయోపిక్‌లో రీల్ టైమ్ కన్నా రియల్ టైమ్ ఎక్కువని, మొదట్లో కెమెరా ముందు కొంత ఇబ్బంది పడ్డానని, కొద్ది రోజుల్లోనే కెమెరా భయం పోయిందని చెప్పుకొచ్చారు. 
 
తనకు సిగ్గు ఎక్కువే కానీ, బాగా, మేనేజ్ చేశానని, ఈ బయోపిక్ లో తన జీవితాన్ని పూర్తిగా ఆవిష్కరించానని, ఈ చిత్రం చూసిన తన అభిమానులు పూర్తి సంతృప్తి చెందుతారని, మిగిలిన బయోపిక్స్‌తో తన బయోపిక్ ను పోల్చుతారని అనుకోనని చెప్పిన సచిన్, ఇప్పటి వరకు తన జీవితంలో పెద్దగా దాచింది ఏమీ లేదని సచిన్ చెప్పుకొచ్చారు. కాగా, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం వచ్చిన విషయం తెల్సిందే.