మంగళవారం, 5 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 4 జులై 2017 (09:36 IST)

చనిపోయే లోపైనా మనవడిని ముద్దాడాలని వుంది.. ఆ క్రికెటర్ తాత

'అపుడు నేను చేసిన తప్పు క్షమించరానిదే. ఇపుడు చేసిన తప్పు ఎంత పెద్దదో తెలుసుకున్నా. నేను చనిపోయే లోపు నా మనవడిని దగ్గరకు తీసుకుని ముద్దాడాలని ఉంది' అంటూ 84 యేళ్ళ వృద్ధుడు వాపోతున్నారు. అతను ముద్దాడాలను

'అపుడు నేను చేసిన తప్పు క్షమించరానిదే. ఇపుడు చేసిన తప్పు ఎంత పెద్దదో తెలుసుకున్నా. నేను చనిపోయే లోపు నా మనవడిని దగ్గరకు తీసుకుని ముద్దాడాలని ఉంది' అంటూ 84 యేళ్ళ వృద్ధుడు వాపోతున్నారు. అతను ముద్దాడాలనుకున్నది టీమిండియా క్రికెటర్లలో ఓ క్రికెటర్‌ను. ఆ క్రికెటర్.. ఆ తాత ఎవరన్నదే కదా మీ సందేహం. అయితే ఈ కథనం చదవండి. 
 
అతని పేరు సంతోఖ్ సింగ్. వయసు 84 యేళ్లు. ఉత్తరాఖండ్‌‌లోని ఉధంసింగ్‌ నగర్‌ జిల్లా కిచ్చా పట్టణవాసి. ఈయన మనవడు జస్పీత్‌ బుమ్రా. భారత క్రికెట్ జట్టు పేసర్. ఈ క్రికెటర్‌కు వృద్ధుడికి మధ్య ఉన్న సంబంధమేంటో పరిశీలిద్ధాం. సంతోఖ్‌ సింగ్‌ కొడుకు జస్బీర్‌ సింగ్‌ కుమారుడే జస్పీత్ బుమ్రా. అంటే స్వయాన తాత. అయితే 2001లో బుమ్రా తండ్రి జస్బీర్‌ సింగ్‌ మరణించాడు. కానీ అప్పుడు బుమ్రాను అతడి తల్లి దల్జీత్‌సింగ్‌ను సంతోఖ్‌ సింగ్‌ తనవద్ద ఉంచుకోలేదు. ఇంటి నుంచి బయటకు పంపేశాడు. ఆనాడు తాను చేసిన పనికి ఆమె ఎంతో కుమిలిపోయి ఉంటుందని సంతోఖ్ సింగ్ ప్రశ్చాత్తాపడుతున్నాడు. 
 
ఇదిలావుంటే, సంతోఖ్‌ సింగ్‌ దశాబ్దం కిందట అహ్మదాబాద్‌ నుంచి జీవనోపాధి కోసం కిచ్చా వచ్చాడు. అప్పట్లో ఆటోల బిజినెస్‌ చేశాడు కానీ దాంట్లో నష్టాలు రావడంతో.. తానే ఆటో డ్రైవర్‌గా మారాల్సి వచ్చింది. 2010లో సంతోఖ్‌ భార్య చనిపోయింది. ప్రస్తుతం ఓ గదిలో ఉంటున్న బుమ్రా తాత.. ఆర్థిక ఇబ్బందులతో మూడు నెలలుగా అద్దె కూడా చెల్లించడం లేదు. అహ్మదాబాద్‌లో నివసించే బుమ్రాను ఎప్పుడెప్పుడు కలుసుకుందామా అని ఉవ్విళ్లూరుతున్నాడు. కనీసం చనిపోయే లోపైనా మనవడిని చూడాలని ఆరాటపడుతున్నాడు.