కెప్టెన్సీకి ధోనీ గుడ్‌బై చెప్పిన వేళ... గంతులేసిన యువరాజ్ తండ్రి?
భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వైదొలుగుతున్నట్టు జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ప్రకటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. కానీ, ఒక్కరికి మాత్రం మహదానందం కలిగించింది. అతనెవరో
భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వైదొలుగుతున్నట్టు జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ప్రకటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. కానీ, ఒక్కరికి మాత్రం మహదానందం కలిగించింది. అతనెవరో కాదు.. భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి. యోగ్‌రాజ్ సింగ్.
భారత క్రికెట్‌లో వన్డే, టీ20ల కెప్టెన్‌గా తప్పుకున్నట్టు.. కానీ ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని ధోనీ ఇటీవల ప్రకటించాడు. ఈ సంచలన నిర్ణయంతో పలువురు ధోనీని పొగుడుతూ, బాధపడుతూ స్పందించారు.
అయితే ఆనందపడుతుంది ఎవరో తెలుసా? ఇప్పుడు ఇదే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ధోనీ తప్పుకోవడంతో ఎగిరి గంతేసిన యోగ్‌రాజ్ సింగ్ అంటూ కామెంట్లు, ఫొటోలు పెడుతున్నారు.
భారత క్రికెట్ జట్టులో తన కుమారుడు యువరాజ్ సింగ్‌కు చోటు దక్కకపోవడానికి కారణం ధోనీనే అంటూ యూవీ తండ్రి యోగ్‌రాజ్ గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.