సంబంధిత వార్తలు
- మహిళల ఐపీఎల్.. బీసీసీఐ గ్రీన్ సిగ్నల్.. కరోనా కాలంలో సూపర్ క్రికెట్ టోర్నీ
- యూఏఈ వేదికగా సెప్టెంబరులో ఐపీఎల్ - 51 రోజుల పాటు కాసుల పోటీలు
- కాసులకు కక్కుర్తిపడిన క్రికెట్ ఆస్ట్రేలియా - ఐపీఎల్ కోసమే టీ20 వాయిదా
- మరికొన్ని గంటల్లో తేలనున్న టీ-20 ప్రపంచ కప్ భవితవ్యం?
- ఐపీఎల్ నిర్వహణకు సిద్ధం - బంపర్ ఆఫర్ ఇచ్చిన దుబాయ్
కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌లో క్రికెట్ దిగ్గజానికి చోటు
ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ వల్ల అనేక క్రీడా పోటీలు వాయిదాపడుతున్నాయి. అయితే, త్వరలో ఐపీఎల్ పోటీల నిర్వహణకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) చర్యలు చేపట్టింది. ఇందుకోసం కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌లో క్రికెట్ దిగ్గజం, జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) చీఫ్ రాహుల్ ద్రవిడ్‌కు చోటుదక్కింది.
రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ప్రామాణిక నిర్వహణ విధానాన్ని(ఎస్వోపీ) సోమవారం ప్రకటించిన బీసీసీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. ఎస్వోపీ నిబంధనలు పాటిస్తూ ప్రాక్టీస్ చేస్తామని ప్లేయర్లు ఆయా రాష్ట్ర సంఘాల సెంటర్లలో సంతకాలతో కూడిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే బెంగళూరులోని ఎన్సీఏలో ఆటగాళ్లకు ట్రైనింగ్‌ను పునఃప్రారంభించేందుకు అవకాశం ఉంది.
కరోనా ప్రమాదం నేపథ్యంలో ట్రైనింగ్‌లో ప్లేయర్లు అందరూ ఎస్వోపీ నిబంధలు పాటించేలా చూసేందుకు బీసీసీఐ కొవిడ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేసింది. దీనిలో ద్రవిడ్‌తో పాటు ఓ మెడికల్ ఆఫీసర్, బీసీసీఐ ఏజీఎమ్ కూడా ఉన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆటగాళ్లు నిబంధనలు పాటించేలా ఈ టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షించనుంది. అలాగే ప్లేయర్లకు వ్యక్తిగతంగా సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు కరోనాపై సమాచారాన్ని అందివ్వనుంది.
అనుసంధానం చేయనుంది. కాగా ఈ నెలలోనే ప్రారంభం కావాల్సిన దేశవాళీ సీజన్ కరోనా కారణంగా వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమవుతుందో కూడా తెలియని పరిస్థితి. ప్లేయర్లు సైతం దాదాపుగా నాలుగు నెలల నుంచి ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు. అయితే ఎస్‌వోపీని పాటిస్తూ రాష్ట్ర సంఘాల కేంద్రాలు, ఎన్సీఏలో ప్రాక్టీస్ చేసేందుకు బీసీసీఐ తాజాగా అనుమతించింది. దీని కోసం ఎస్‌వోపీని పాటిస్తామని ప్లేయర్లు సంతకాలు చేయాల్సి ఉంటుంది.
