ధోనీ అలసిపోయాడు.. అభిమానితో నో సెల్ఫీ.. బ్యాగ్ పడిపోయినా కారు దూసుకెళ్లిందా?
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. కెప్టెన్సీ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేల్లో ఆడుకుంటున్నాడు. కెప్టెన్‌గా అలసిపోయి.. క్రికెటర్‌గా కొనసాగుతున్న ధోనీకి కూల్ కెప్టెన్ అనే పేరుంది. అయిత
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. కెప్టెన్సీ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేల్లో ఆడుకుంటున్నాడు. కెప్టెన్‌గా అలసిపోయి.. క్రికెటర్‌గా కొనసాగుతున్న ధోనీకి కూల్ కెప్టెన్ అనే పేరుంది. అయితే ప్రస్తుతం ధోనీ అలిసిపోతున్నట్లు కనిపిస్తున్నాడు. ఫ్యాన్స్‌కు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఫ్యాన్స్‌తో సెల్ఫీ తీసుకోవాలంటేనే అబ్బా అనుకుంటున్నాడు. అలాంటి ఘటనే.. జార్ఖండ్‌లో చోటుచేసుకుంది.
విజయ్ హజారే ట్రోఫీ ముగించుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ, కోల్ కతా నుంచి జార్ఖండ్ చేరుకున్నాడు. రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయం బయట తన వాహనం కోసం ఎదురు చూస్తున్న సమయంలో 35ఏళ్ల ఓ మహిళాభిమాని ధోనీతో సెల్ఫీ దిగి, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ప్రయత్నించింది. కానీ అప్పటికే ధోనీ అలసిపోయాడు. అందుకు నిరాకరించాడు. తన కారు రావడంతో అందులో ఎక్కేశాడు. కానీ ఆ ఫ్యాన్ మాత్రం పట్టు వదలకుండా ధోనీ వాహనానికి అడ్డు తగిలింది. దీంతో, వెంటనే స్పందించిన విమానాశ్రయ సిబ్బంది, ఆమెను పక్కకు వెళ్లమని చెప్పారు.
ఈ నేపథ్యంలో సిబ్బందికి, ఆ మహిళకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో మహిళ హ్యాండ్ బ్యాగ్ కింద పడిపోవడంతో, దానిని తీసుకునేందుకు పక్కకు వెళ్లడంతో ధోనీ కారు దూసుకుపోయింది. అయితే, ఆ హ్యాండ్ బ్యాగుపై నుంచి వాహనం వెళ్లినట్టు గుర్తించిన ధోనీ, తన కారు ఆపి, డోర్ తీసి వెనక్కి చూశాడు. ఎటువంటి ప్రమాదం జరగలేదని నిర్ధారించుకున్న తర్వాత ధోనీ వెళ్లిపోయాడు.