శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 24 జులై 2017 (11:59 IST)

#WWC17Final : భారత మహిళా క్రికెటర్లకు బంపర్ ఆఫర్.. హర్మన్‌కు డీఎస్పీ ఉద్యోగం!

మహిళల ప్రపంచ కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి... తృటిలో కప్‌ను కోల్పోయిన టీమిండియా జట్టుపై సర్వత్ర ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెటర్లు పోరాడినప్పటికీ, కీలక సమయంలో త

మహిళల ప్రపంచ కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి... తృటిలో కప్‌ను కోల్పోయిన టీమిండియా జట్టుపై సర్వత్ర ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెటర్లు పోరాడినప్పటికీ, కీలక సమయంలో తీవ్ర ఒత్తిడికిలోనై, 9 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు. 
 
ఈ ప్రయాణంలో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై సుడిగాలి ఇన్నింగ్స్‌తో కేవలం 115 బంతుల్లోనే 171 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది బ్యాట్స్ ఉమన్ హర్మన్ ప్రీత్ కౌర్. ఈ నేపథ్యంలో ఆమెను పంజాబ్ ప్రభుత్వం సమున్నతంగా గౌరవించింది. ఆమెకు డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్టు ప్రకటించింది. 
 
కాగా, ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓడినప్పటికీ... భారత మహిళా జట్టులోని రైల్వే క్రికెటర్లకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభూ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. పదోన్నతులతో సహా నగదు ప్రోత్సాహకాలిస్తామన్నారు. ఈ విషయాన్ని రైల్వే స్పోర్ట్స్‌ ప్రమోషన్‌( ఆర్‌ఎస్‌పీబీ) సెక్రటరీ రేఖా యాదవ్‌ మీడియాకు తెలిపారు.
 
మిథాలీ సేనలోని 15 మంది సభ్యుల్లో 10 మంది రైల్వే ఉద్యోగులు ఉండటం విశేషం. కెప్టెన్‌ మిథాలీతో సహా వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, ఎక్తా బిష్త్‌, పూనమ్‌ రౌత్‌, వేధ కృష్ణమూర్తి, పూనమ్‌ యాదవ్‌, సుష్మా వర్మ, మోనా మెశ్రామ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, నుజాత్‌ పర్విన్‌లు రైల్వే ఉద్యోగులే. వీరి అద్భుత ప్రదర్శనతోనే భారత్‌ ఫైనల్‌కు చేరిందని రైల్వే శాఖ సంతోషం వ్యక్తం చేసింది.