శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 డిశెంబరు 2020 (15:09 IST)

ఎడమచేతివాటం ఆటగాళ్లను ఔట్ చేయడంలో ముత్తయ్యను అధికమించిన అశ్విన్

శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్. ఈయన క్రికెట్ కెరీర్‌లో ఎన్నో మైలు రాళ్లు ఉన్నాయి. ఆ రికార్డులు ఇపుడు ఒక్కొక్కటిగా కనుమరుగైపోతున్నాయి. తాజాగా మరో రికార్డు బ్రేక్ అయింది. దీన్ని భారత క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బ్రేక్ చేశాడు. ఎడమచేతివాటం ఆటగాళ్లను ఔట్ చేయడంలో మురళీధరన్ పేరిట ఓ రికార్డు ఉంది. ఈ శ్రీలంక మాజీ క్రికెటర్ టెస్ట్ కెరీర్‌లో కెరీర్‌లో మొత్తం 191 మంది లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్లను ఔట్ చేశాడు. ఇపుడు ఈ రికార్డే బ్రేక్ అయింది. 
 
ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్ - గవాస్కర్ సిరీస్ జరుగుతోంది. ఇందులోభాగంగా, బాక్సింగ్‌ డే టెస్టు నాలుగో రోజు ఆట ఉదయం సెషన్‌లో అశ్విన్‌ ఈ ఫీట్‌ అందుకున్నాడు. ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ జోష్ హేజిల్‌వుడ్‌ను 10 పరుగుల వద్ద అవుట్ చేయడం ద్వారా మురళీధరన్‌ను అధిగమించాడు. అశ్విన్‌ ఔట్‌ చేసిన 192వ లెఫ్ట్‌ హ్యాండర్‌ హేజిల్‌వుడ్‌ కావడం విశేషం. 
 
ఇప్పటివరకు 191 మంది ఎడమచేతివాటం ఆటగాళ్లను ఔట్‌ చేసిన రికార్డు మురళీధరన్‌ పేరిట ఉంది. ఈ జాబితాలో ఇంగ్లాండ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌(186) మూడు, ఆస్ట్రేలియా దిగ్గజాలు గ్లెన్‌ మెక్‌గ్రాత్‌(172), షేన్‌ వార్న్‌(172) నాలుగులో ఉన్నారు. భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే 167 మందిని ఔట్‌ చేసి ఐదో స్థానంలో ఉన్నాడు.